Ambati Rayudu: సీఎం జగన్ ను కలిసిన అంబటి రాయుడు, సీఎస్కే యజమాని కుమార్తె

Ambati Rayudu and Rupa Gurunath met CM Jagan

  • ఇటీవల ఐపీఎల్ సమయంలోనూ జగన్ తో రాయుడి భేటీ
  • నేడు మరోసారి తాడేపల్లి వచ్చిన తెలుగు క్రికెటర్
  • క్యాంపు కార్యాలయంలో సమావేశం
  • సీఎస్కే ఆటగాళ్ల సంతకాల జెర్సీ సీఎంకు బహూకరణ

ఇటీవలే ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ప్రముఖ తెలుగు క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు నేడు ఏపీ సీఎం జగన్ తో సమావేశమయ్యారు. ఈ మధ్యాహ్నం తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చిన రాయుడు సీఎం జగన్ ను కలిశారు. 

ఇవాళ్టి సమావేశంలో రాయుడుతో పాటు చెన్నై సూపర్ కింగ్స్ యజమాని ఎన్.శ్రీనివాసన్ కుమార్తె రూపా గురునాథ్, ఇతర సీఎస్కే పెద్దలు కూడా పాల్గొన్నారు. ఐపీఎల్ విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ గెలుచుకున్న ట్రోఫీని వారు సీఎం జగన్ కు చూపించారు. ఐపీఎల్ విజేతగా నిలిచిన చెన్నై జట్టును ఈ సందర్భంగా సీఎం జగన్ అభినందించారు. ఈ క్రమంలో, చెన్నై ఆటగాళ్ల సంతకాలతో కూడిన జెర్సీని రూపా గురునాథ్, రాయుడు సీఎం జగన్ కు బహూకరించారు. 

ఈ భేటీలో రాయుడు మాట్లాడుతూ, ఏపీలో క్రీడా రంగం అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా క్రీడలను ప్రోత్సహించేందుకు తాను ఆసక్తిగా ఉన్నట్టు రాయుడు సీఎం జగన్ కు వివరించాడు. క్రీడల అభివృద్ధికి తగిన సూచనలు స్వీకరిస్తామని, ఆ మేరకు పటిష్ఠమైన కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందిస్తుందని సీఎం జగన్ హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News