US man: 7 అంగుళాల ఎత్తు పెరిగేందుకు రూ.88 లక్షల ఖర్చు
- అమెరికాలోని జార్జియా వాసి సాహసం
- ఆరు అడుగుల ఎత్తు ఉన్నా.. కాళ్లు కొంచెం కురచ
- డాక్టర్ల సూచనతో రెండు సార్లు సర్జరీలు
- ఆరు అడుగుల ఏడు అంగుళాలకు చేరనున్న ఎత్తు
ఆరడుగుల అందగాడిగా కనిపించాలనే ఆకాంక్ష చాలా మందికి ఉంటుంది. కానీ, అందరూ అన్ని అడుగుల పొడవు పెరుగుతారని గ్యారంటీ లేదు. పది మందిలో ఒక్కరికే అది సాధ్యం అవుతుంది. అయితే, ఆరు అడుగుల ఎత్తున్నా.. మరింత పెరగాలని అనుకున్నాడు అమెరికాకు చెందిన 33 ఏళ్ల బ్రియాన్ శాంచెజ్. తన కురచ కాళ్లు, దేహం ఎగువ భాగం మధ్య బ్యాలన్స్ సరిగ్గా లేదనుకున్నాడు. అందుకే ఎత్తు పెరిగేందుకు రూ.88 లక్షలు ఖర్చు చేశాడు.
జార్జియా ప్రాంతానికి చెందిన ఈ బిల్డర్.. అసహజంగా తన కాళ్లు కనిపిస్తుండడంతోనే ఈ నిర్ణయానికి వచ్చాడు. టర్కీలోని లైవ్ లైఫ్ టాలర్ అనే క్లినిక్ డాక్టర్లను సంప్రదించాడు. 2022 డిసెంబర్ లో ఆపరేషన్ నిర్వహించారు. కాళ్లలో ఎముకలకు రాడ్ ను అమర్చారు. 2023 మార్చిలో మరో విడత సర్జరీ చేశారు. దీంతో మూడున్నర అంగుళాల ఎత్తు పెరిగాడు. పూర్తిగా కోలుకుంటే తన ఎత్తు ఆరు అడుగుల ఏడు అంగుళాలకు చేరుతుందని చెప్పాడు. కృత్రిమంగా ఎత్తు పెరగడం కంటే, సహజసిద్ధంగా దాన్ని సాధించడంలోనే సౌకర్యం ఉంటుందని తెలిసిందే.