Team India: భారీ ఆధిక్యంపై కన్నేసిన ఆసీస్... బౌలర్లపై భారం వేసిన టీమిండియా
- ముగిసిన మూడో రోజు ఆట
- రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ 123-4
- ప్రస్తుతం ఆసీస్ ఆధిక్యం 296 రన్స్
- ఆటకు మరో రెండ్రోజుల సమయం
డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా జట్టు భారీ ఆధిక్యం దిశగా పయనిస్తోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ 4 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. క్రీజులో మార్నస్ లబుషేన్ 41 పరుగులతోనూ, కామెరాన్ గ్రీన్ 7 పరుగులతోనూ ఉన్నారు.
టీమిండియా బౌలర్లలో జడేజా 2, సిరాజ్ 1, ఉమేశ్ యాదవ్ 1 వికెట్ తీశారు. ఆసీస్ జట్టులో ఉస్మాన్ ఖవాజా 13, వార్నర్ 1, స్టీవ్ స్మిత్ 34, ట్రావిస్ హెడ్ 18 పరుగులు చేశారు.
ప్రస్తుతం ఆసీస్ ఆధిక్యం 296 పరుగులు కాగా, ఆటకు మరో రెండ్రోజుల సమయం మిగిలింది. రేపు బౌలర్లు వీలైనంత త్వరగా ఆసీస్ ను ఆలౌట్ చేస్తేనే భారత్ కు ఈ మ్యాచ్ లో అవకాశాలు ఉంటాయి. ఆసీస్ ఆధిక్యం 350 పరుగులు దాటితే భారత్ కు కష్టమే.
టీమిండియా తన తొలి ఇన్నింగ్స్ ను 296 పరుగుల వద్ద ముగించడం తెలిసిందే. దాంతో ఆసీస్ కు 173 పరుగుల కీలక ఆధిక్యం లభించింది.