ICMR: దేశ జనాభాలో 11 శాతం మందికి మధుమేహం

Over 11 Percent Indians Diabetic and 35 percent Have Hypertension says ICMR Survey

  • 35 శాతం మందికి బీపీ
  • ఐసీఎంఆర్ నివేదిక వెల్లడి
  • కొంత మెరుగ్గా తెలుగు రాష్ట్రాల పరిస్థితి

దేశంలో మధుమేహ బాధితుల సంఖ్య వేగంగా పెరిగిపోతోందని, బీపీ బాధితులు కూడా ఎక్కువేనని ఇండియాస్ మెటబాలిక్ హెల్త్ రిపోర్ట్ (ఐసీఎంఆర్) వెల్లడించింది. జనాభాలో 11 శాతం మందికి మధుమేహం ఉందని పేర్కొంది. మరో 15 శాతం మంది ప్రీడయాబెటిక్ స్టేజిలో ఉన్నారని తెలిపింది. బీపీతో బాధపడుతున్న వారి సంఖ్య తక్కువేం కాదని, మొత్తంగా 35.5 శాతం మంది రక్తపోటు బాధితులేనని వెల్లడించింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన అధ్యయనంలో ఈ వివరాలు బయటపడ్డాయని తెలిపింది. ఈ పరిశోధనా పలితాలను లాన్సెట్ జర్నల్ కూడా ప్రచురించింది. 

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అసాంక్రమిక వ్యాధుల భారాన్ని అంచనా వేయడానికి ఈ అధ్యయనం చేపట్టినట్లు ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు తెలిపారు. ఇందులో భాగంగా 1,13,043 మంది నుంచి నమూనాలు సేకరించి, విశ్లేషించామని వివరించారు. ఈ నివేదిక ప్రకారం.. మధుమేహం, బీపీ బాధితుల విషయంలో తెలుగు రాష్ట్రాల పరిస్థితి కొంతవరకు మెరుగ్గానే ఉందని చెప్పారు. మధుమేహ బాధితులు ఎక్కువగా గోవా, పుదుచ్చేరి, కేరళ, చండీగఢ్, ఢిల్లీలలో ఉన్నారని, ఈ జాబితాలో తెలంగాణ 17వ స్థానంలో, ఆంధ్రప్రదేశ్ 19వ స్థానంలో నిలిచాయని తెలిపారు. తెలంగాణలో 9.9 శాతం, ఏపీలో 9.5 శాతం మంది మధుమేహంతో బాధపడుతున్నారని చెప్పారు.

  • Loading...

More Telugu News