Apsara Murder: అప్సర హత్య కేసులో మిస్టరీని తేల్చనున్న పోస్టుమార్టం రిపోర్టు

 Post Mortem Report Will Be Key To Apsara Murder Case Says Police

  • పూజారి సాయికృష్ణకు 14 రోజుల రిమాండ్
  • చర్లపల్లి జైలుకు తరలించిన పోలీసులు
  • రెండోసారి గర్భందాల్చడంతో ఇద్దరి మధ్య గొడవ
  • అదే హత్యకు దారితీసిందని అనుమానిస్తున్న పోలీసులు 

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సరూర్ నగర్ హత్య కేసులో పోస్టుమార్టం రిపోర్టు కీలకంగా మారనుంది. అప్సర హత్యకు సంబంధించిన మిస్టరీని ఈ నివేదిక తేల్చేస్తుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు బయటపడనున్నాయని చెప్పారు. పోస్టుమార్టం నిర్వహించేందుకు మృతురాలి తల్లిదండ్రుల సంతకాలు తప్పనిసరి కావడం, అప్సర తండ్రి కాశీ పర్యటనలో ఉండడంతో ఆలస్యం జరుగుతోందని వివరించారు.

దీంతో శుక్రవారం మధ్యాహ్నం నుంచి అప్సర మృతదేహం ఉస్మానియా మార్చురీలోనే ఉంది. అప్సర తండ్రి శనివారం తిరిగి వచ్చే అవకాశం ఉందని, ఆయన రాగానే డాక్టర్లు పోస్టుమార్టం మొదలుపెడతారని సమాచారం. అప్సరను దారుణంగా చంపేసిన సాయికృష్ణను అదుపులోకి తీసుకున్న పోలీసులు శనివారం ఉదయం జడ్జి ముందు హాజరుపరచగా.. 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో సాయికృష్ణను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. 

గుడికి వచ్చిన అప్సరతో పరిచయం పెంచుకున్న సాయికృష్ణ.. చనువుగా మసులుతూ ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని పోలీసులు చెప్పారు. అప్సర ఇంటికి రాకపోకలు సాగిస్తూ ఆమె తల్లిని అక్కా అని పిలుస్తూ కుటుంబానికి దగ్గరయ్యాడని వివరించారు. ఈ క్రమంలో అప్సర గర్భందాల్చగా సాయికృష్ణ అబార్షన్ చేయించాడని, రెండోసారి కూడా గర్భం దాల్చడంతో ఇరువురి మధ్య వివాదం జరిగిందని అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం తర్వాత కేసు కొలిక్కి రానుందని అధికారులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News