YS Avinash Reddy: బెయిల్ వచ్చిన తర్వాత రెండో సారి సీబీఐ విచారణకు హాజరైన అవినాశ్ రెడ్డి
- మధ్యంతర బెయిల్ పై ఉన్న అవినాశ్ రెడ్డి
- ప్రతి శనివారం సీబీఐ విచారణకు హాజరుకావాలని టీఎస్ హైకోర్టు షరతు
- ఐదుగురు అధికారులు అవినాశ్ ను విచారిస్తున్నట్టు సమాచారం
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని ఏ8గా సీబీఐ పేర్కొన్న సంగతి తెలిసిందే. మరోవైపు అవినాశ్ కు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే ప్రతి శనివారం సీబీఐ విచారణకు హాజరుకావాలంటూ అవినాశ్ కు షరతు విధించింది. ఈ క్రమంలో ఈరోజు సీబీఐ విచారణకు అవినాశ్ హాజరయ్యారు. సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగనుంది.
ముందస్తు బెయిల్ పొందిన తర్వాత సీబీఐ విచారణకు అవినాశ్ హాజరు కావడం ఇది రెండో సారి. ఐదుగురు అధికారులు అవినాశ్ ను విచారిస్తున్నట్టు సమాచారం. హత్య జరిగిన రోజు అర్ధరాత్రి మాట్లాడిన వాట్సాప్ కాల్స్ పైనే అధికారులు ప్రధానంగా ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది.