petrol: ఇప్పుడేం చెప్పలేం కానీ...: పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై కేంద్రమంత్రి

Cut In Petrol Diesel Rates What Minister Hardeep Puri Said

  • సమయం గడుస్తున్న కొద్దీ స్పష్టత వస్తుందన్న హర్దీప్ సింగ్ పూరి 
  • బీజేపీయేతర రాష్ట్రాలే ధరల పెరుగుదలపై గొంతు చించుకుంటున్నాయని విమర్శ
  • ఆ రాష్ట్రాల్లోనే ధరలు అధికంగా ఉన్నాయన్న కేంద్రమంత్రి

చమురు ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తే వినియోగదారులపై పెద్ద మొత్తంలో భారం తగ్గుతుందనే అభిప్రాయం ఎప్పటి నుంచో ఉంది. ఈ నేపథ్యంలో తగ్గింపు విషయమై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై ఇప్పుడే ఏమీ చెప్పలేనని అన్నారు. సమయం గడుస్తున్న కొద్దీ ఈ విషయంపై స్పష్టత వస్తుందన్నారు. గత త్రైమాసికంలో ప్రభుత్వరంగ పెట్రోలియం సంస్థలు సంతృప్తికర ఆర్థిక ఫలితాలు సాధించాయన్నారు.

కొంతమేర నష్టాలను పూడ్చుకోగలిగాయన్నారు. రాబోయే రోజుల్లో ధరలు తగ్గించడంపై ఏం చేయాలనేది ఆలోచిస్తామన్నారు. సామాన్యులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలే పెట్రోల్ ధరలపై గొంతు చించుకుంటున్నాయని, కానీ ఆ రాష్ట్రాల్లోనే ధరలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఆయా రాష్ట్రాలు వ్యాట్ తగ్గించకపోవడం వల్లే ధరలు ఎక్కువగా ఉన్నాయన్నారు.

  • Loading...

More Telugu News