Mitchell Stark: డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిశాక మైదానంలో క్రికెట్ దంపతుల ముచ్చట్లు... ఫొటోలు ఇవిగో!

Stark and Healy spotted in The Oval after WTC Final conclusion
  • డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆసీస్ విజయం
  • గ్యాలరీ లోంచి మ్యాచ్ ను వీక్షించిన స్టార్క్ అర్ధాంగి హీలీ
  • స్టార్క్-హీలీ ముచ్చట్లను కెమెరాల్లో బంధించిన మీడియా
మిచెల్ స్టార్క్... గత కొంతకాలంగా ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న ఫాస్ట్ బౌలర్. ఓవల్ మైదానంలో టీమిండియాతో జరిగిన ఫైనల్లోనూ స్టార్క్ తనవంతు పాత్రను సమర్థంగా పోషించాడు. ఇక, స్టార్క్ జీవనసహచరి కూడా క్రికెటరే. ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు వికెట్ కీపర్ అలీసా హీలీని స్టార్క్ పెళ్లాడాడు. 

ఇవాళ తన భర్త స్టార్క్ మ్యాచ్ ఆడుతుండగా గ్యాలరీ లోంచి హీలీ వీక్షించింది. ఇక మ్యాచ్ ముగిశాక మైదానంలోకి అడుగు పెట్టిన హీలీ తన భర్త స్టార్క్ తో కలిసి డ్రింక్ తీసుకుంటూ, సరదాగా ముచ్చట్లాడుతూ మైదానం అంతా కలియదిరిగింది. ఈ క్రికెట్ జోడీని మీడియా కెమెరాలు క్లిక్ మనిపించాయి. 
Mitchell Stark
Alyssa Healy
The Oval
WTC Final
Australia

More Telugu News