Nara Lokesh: ఈ కాలకేయుల దెబ్బకు బద్వేలు ఎమ్మెల్యే స్థలానికే దిక్కులేదు: లోకేశ్
- బద్వేలులో లోకేశ్ పాదయాత్ర
- ఆర్టీసీ బస్టాండు వద్ద యువగళం సభ
- స్థానిక ఎమ్మెల్యేను డమ్మీని చేశారన్న లోకేశ్
టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర గత 124 రోజుల పాటు రాయలసీమను హోరెత్తించింది. యువగళం పాదయాత్ర మంగళవారం నాడు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించనుంది. రేపు లోకేశ్ ఆత్మకూరు నియోజకవర్గంలో పాదయాత్ర జరపనున్నారు.
ఇవాళ 124వ రోజు యువగళం పాదయాత్ర బద్వేలు విద్యానగర్ నుంచి ప్రారంభమైంది. బద్వేలు ఆర్టీసి బస్టాండు వద్ద నిర్వహించిన బహిరంగ సభకు కనీవినీ ఎరుగని రీతిలో స్పందన లభించింది. బస్టాండ్ కూడలి నుండి సిద్ధవటం రోడ్, పోరుమామిళ్ల రోడ్, నెల్లూరు రోడ్ జనప్రవాహాన్ని తలపించాయి. ఎటు చూసినా రెండు కిలోమీటర్ల మేర ప్రజలు బారులు తీరారు.
నారా లోకేశ్ ప్రసంగం సాగిందిలా...
ఎమ్మెల్యేని డమ్మీని చేసి వైసీపీ దొంగల దోపిడీ!
బద్వేల్ ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తారని మీరు వైసీపీని భారీ మెజారిటీ తో గెలిపించారు. కానీబద్వేల్ లో జరిగింది ఏంటి? అభివృద్ధి నిల్లు... భూకబ్జాలు ఫుల్లు. బద్వేల్ ఎమ్మెల్యే సుధ గారి స్థలాన్నే వైసీపీ నాయకులు కబ్జా చేశారు అంటే ఉమ్మడి కడప జిల్లాలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. అందుకే బద్వేల్ వైసీపీ నాయకులకి ముద్దుగా కాలకేయులు అని పేరు పెట్టా. రూ.2 వేల కోట్ల విలువైన ప్రభుత్వ, ప్రైవేట్ భూములు కబ్జా చేశారు ఈ వైసీపీ భూ బకాసురులు. ఎమ్మెల్సీ గోవింద రెడ్డి బద్వేల్ ని మండలాల వారీగా కేకులా కోసి బంధువులకు పంచేశారు.
ఫుడ్ కమిటీ చైర్మన్ భూదోపిడీ!
పోరుమామిళ్లలో ఫుడ్ కమిటీ ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి రూ.300 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసి అమ్మేశాడు. యూట్యూబ్ లో నీతిమంతుడిలా బిల్డప్ ఇచ్చే ప్రతాప్ రెడ్డి అనుచరులు సర్వే నెంబర్ 1289లో 11 ఎకరాలు, సర్వే నెంబర్ 1094,1076/1ఎ భూములను బినామీ పేర్లతో కాజేశారు. రంగసముధ్రం చెరువు సమీపంలో సర్వే నెంబర్ 916-లో 23.80 ఎకరాలు ప్రతాప్ రెడ్డి ఆక్రమించారు.
రంగ సముద్రం రెవిన్యూ పొలం లో సర్వే నెంబర్ 1076/1ఏలో 10.65 ఎకరాల మాదిగ ఈనామ్ భూముల ఆక్రమణ, సర్వే నెంబర్ 1095లో 20.30 ఎకరాలు, 1095/3 లో మూడు ఎకరాలు నకిలీ పత్రాలతో ఆక్రమణ, సర్వే నెంబర్ 1096లో 2.36 ఎకరాల రహదారి అక్రమణ, సర్వే నెంబర్ 1108లో1.47 ఎకరాలు ఆక్రమించారు. కలసపాడు వైసీపీ నేత గురివిరెడ్డి ఆసుపత్రి భూమినే లేపేశాడు. మరో 40 ఎకరాలు తన కుటుంబ సభ్యుల పేర్లతో కొట్టేసాడు.
వైసీపీ నేత పురుషోత్తం రెడ్డి కలసపాడు, పాత రామాపురం, శంఖవరం, మామిళ్లపల్లి భూములతో పాటు అటవీ భూమి కూడా కలిపి 120 ఎకరాలు కబ్జా చేశాడు. బద్వేల్ మున్సిపాలిటీలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరగాలి అన్నా ఛైర్మన్ రాజగోపాల్ రెడ్డికి కాంట్రాక్టర్లు 23 శాతం కప్పం కట్టాల్సిందే. అందుకే కాంట్రాక్టర్లు పనులు చెయ్యబోమంటూ చేతులు ఎత్తేశారు.
బద్వేలుకు జగన్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?
బద్వేల్ కి జగన్ అనేక హామీలు ఇచ్చాడు. బద్వేల్ టౌన్ ని మోడల్ టౌన్ గా మారుస్తానని చెప్పాడు. బద్వేల్, గోపవరం, అట్లూరు మండలాలకు సోమశిల బ్యాక్ వాటర్ వద్ద లిఫ్ట్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసి సాగునీరు అందిస్తాం అని హామీ ఇచ్చాడు. వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేసి పోరుమామిళ్ల, కలసపాడు మండలాలకు రెండేళ్లలోనే సాగు, తాగునీరు అందిస్తాం అని చెప్పి మోసం చేశాడు. పోరుమామిళ్ల చెరువు ముంపు బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చాడు.
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేస్తాం
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి సాగు, తాగు నీరు సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం. సోమశిల బ్యాక్ వాటర్ ద్వారా బద్వేల్ చెరువు నింపుతాం. పోరుమామిళ్ల చెరువును అభివృద్ధి చేస్తాం. ముంపు బాధితులకు న్యాయం చేస్తాం. మిషన్ రాయలసీమ లో భాగంగా జిల్లాకు పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం. బద్వేల్ టౌన్ ని అభివృద్ధి చేస్తాం. వాటర్ గ్రిడ్ పథకంలో భాగంగా ప్రతి ఇంటికీ తాగునీరు అందిస్తాం. టీడీపీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టను. బద్వేల్ లో ఉన్నా, బంగ్లాదేశ్ పారిపోయినా పట్టుకొచ్చి లోపలేస్తా.
*యువగళం వివరాలు:*
*ఇప్పటి వరకు నడిచిన మొత్తం దూరం 1584.1 కి.మీ.*
*ఈరోజు నడిచిన దూరం 15 కి.మీ.*
*125వ రోజు పాదయాత్ర వివరాలు (13-6-2023):*
*ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం (ఉమ్మడి నెల్లూరు జిల్లా):*
సాయంత్రం
4.00 – పిపి కుంట క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
4.20 – బద్వేలు ఫారెస్ట్ రేంజి -1 లో యువతతో సమావేశం.
4.40 – బద్వేలు ఫారెస్ట్ రేంజి-2 లో మహిళలతో సమావేశం.
5.00 – బద్వేలు ఫారెస్ట్ రేంజి-3 లో రైతులతో సమావేశం.
*5.10 – ఉమ్మడి నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశం.*
7.30 – కదిరినాయుడుపల్లెలో స్థానికులతో సమావేశం.
8.15 – నాయుడుపల్లె శివారు విడిది కేంద్రంలో బస.
******