Tremors: దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తర భారతంలో భూ ప్రకంపనలు
- జమ్మూకశ్మీర్ లో భూకంప కేంద్రం
- 5.7 తీవ్రతతో భూకంపం
- శ్రీనగర్ లో పరుగులు తీసిన ప్రజలుః
ఉత్తర భారతదేశంలో ఇవాళ భూ ప్రకంపనలు వచ్చాయి. జమ్మూ కశ్మీర్ లో ఇవాళ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రతను 5.7 గా గుర్తించారు. కిస్త్వాడ్ కు ఈశాన్య దిశగా 30 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు ఈఎంఎస్ సీ వెల్లడించింది. జమ్మూ కశ్మీర్ లో తీవ్ర ప్రకంపనలు రాగా... దీని ప్రభావంతో దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తర భారతదేశంలోని పలు పాంత్రాల్లో భూమి కంపించింది. కొన్ని సెకన్ల పాటు ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. శ్రీనగర్ లో ప్రజలు దుకాణాల నుంచి బయటకు పరుగులు తీశారు. స్కూళ్లలో ఉన్న చిన్నారులు హడలిపోయారు.