Vijayasai Reddy: అమిత్ షా, జేపీ నడ్డాల అవినీతి ఆరోపణలపై విజయసాయిరెడ్డి స్పందన

Vijayasai Reddy response on Amit Shah and JP Nadda comments on YSRCP govt

  • అవినీతి ఎక్కడ జరిగిందో ఇద్దరూ చెప్పలేకపోయారన్న విజయసాయి
  • కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఎప్పుడూ సమన్వయం ఉంటుందని వ్యాఖ్య
  • ఏ పార్టీతోనూ వైసీపీ పొత్తు పెట్టుకోదని స్పష్టీకరణ

గత కొంత కాలంగా మౌనంగా ఉన్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. ఏపీ పర్యటనకు వచ్చిన సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు చేసిన వ్యాఖ్యలపై విజయసాయి స్పందించారు. పార్టీ వేరు, ప్రభుత్వం వేరు అని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఎప్పుడూ సమన్వయం ఉంటుందని చెప్పారు. 

వైసీపీ పాలనలో అంతులేని అవినీతి జరిగిందని అమిత్ షా, జేపీ నడ్డా ఆరోపణలు చేశారనీ... అయితే, అవినీతి ఎక్కడ జరిగిందో మాత్రం చెప్పలేకపోయారని విజయసాయి అన్నారు. ఆడిటింగ్ లో ఏమైనా అవినీతిని గుర్తించారా? అని ప్రశ్నించారు. విభజన చట్టంలోని హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో కూడా వైసీపీ పొత్తు పెట్టుకోదని చెప్పారు. ఏపీ పరిపాలన రాజధాని విశాఖలోనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News