Telangana: వాహనాల పొల్యూషన్ టెస్టింగ్ ఫీజు పెంచిన తెలంగాణ.. ఏ వాహనానికి ఎంతంటే..!
- జీవో నెంబర్ 23ని విడుదల చేసిన రవాణాశాఖ
- బైక్ కు రూ.50, కార్లకు రూ.75 నుండి రూ.100 వరకు పెంపు
- ఏడేళ్లుగా అదే ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు తెలిపిన రవాణా శాఖ
- వేతనాలు, వ్యయాలు పెరగడంతో ఇప్పుడు ఫీజు పెంచుతున్నట్లు వెల్లడి
తెలంగాణ రవాణా శాఖ కీలక ప్రకటన చేసింది. వాహనాల పొల్యూషన్ టెస్టింగ్ పరీక్ష ఫీజును పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు జీవో నెంబర్ 23ని విడుదల చేసింది. ఇక నుండి వెహికిల్ ను పరీక్షించి సర్టిఫికెట్ జారీ చేసేందుకు బైక్ కు రూ.50, పెట్రోల్ త్రీవీలర్స్ కు రూ.60, పెట్రోల్ కార్లకు రూ.75, డీజిల్ కార్లకు రూ.100, డీజిల్ లో ఇతర కేటగిరీ వాహనాలన్నింటికీ రూ.100 చొప్పున ఫీజును వసూలు చేయనున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఏడేళ్ల క్రితం ఉన్న ఛార్జీలను వసూలు చేస్తున్నారని, కానీ ఈ ఏడేళ్ల కాలంలో వేతనాలు, వ్యయాలు పెరిగాయని, ఈ నేపథ్యంలో ఫీజును పెంచుతున్నట్లు తెలిపింది.