farmers: కురుక్షేత్ర అధికారులతో రైతుల చర్చలు... ఆందోళన విరమణ.. ఇక రోడ్ల దిగ్బంధం ఉండదని ప్రకటన!
- పిప్లిలో పంట మద్దతు ధర కోసం రైతుల ఆందోళన
- అధికారులతో చర్చలు... మద్దతు ధర కోసం హామీ
- ఆందోళనను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన రాకేశ్ టికాయత్
హర్యానాలోని కురుక్షేత్ర జిల్లా పిప్లిలో పంట మద్దతు ధర కోసం చేస్తున్న ఆందోళనను రైతులు విరమించారు. స్థానిక అధికారులతో చర్చల అనంతరం మద్దతు ధరపై సానుకూల నిర్ణయం రావడంతో ఆందోళన విరమించినట్లు భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్ చెప్పారు. పొద్దు తిరుగుడు పంటకు సరైన ధరను వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చినట్లు కురుక్షేత్ర డిప్యూటీ కమిషనర్ శాంతను శర్మ వెల్లడించారు.
పొద్దు తిరుగుడుకు మద్దతు ధరను డిమాండ్ చేస్తూ రైతులు ఢిల్లీ - చండీగఢ్ వంటి ముఖ్యమైన రహదారిని బ్లాక్ చేశారు. ఇతర రహదారుల్లోను నిరసన వ్యక్తం చేశారు. ఎట్టకేలకు అధికారుల హామీతో వారు ఆందోళనను విరమించారు. తమ పంటకు మద్దతు ధర చెల్లిస్తామని అధికారులు హామీ ఇచ్చారని, దీంతో తాము రహదారి దిగ్బంధాన్ని నిలిపివేస్తున్నామని రాకేశ్ టికాయత్ తెలిపారు.