Keerthi Suresh: దిల్ రాజు మాట కాదనలేకనే కీర్తి సురేశ్ ఆ సినిమా ఒప్పేసుకుందట!

Keerthi Suresh in Dil Raju Movie
  • 'దసరా'తో హిట్ అందుకున్న కీర్తి సురేశ్
  • మరోసారి నాయిక ప్రధానమైన కథకు గ్రీన్ సిగ్నల్ 
  • దిల్ రాజు బ్యానర్లో నిర్మితం కానున్న సినిమా 
  • ముఖ్యమైన పాత్రలో కనిపించనున్న సుహాస్ 
కీర్తి సురేశ్ 'మహానటి' సినిమాలో సావిత్రి పాత్రలో అద్భుతంగా చేయడం చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. ఒక కొత్త అమ్మాయి ఇంత బాగా ఎలా చేసిందబ్బా అంటూ గొప్పగా చెప్పుకున్నారు. అయితే ఆమె చైల్డ్ ఆర్టిస్టుగా కెమెరా ముందుకు ఎప్పుడో వచ్చిందనే విషయం తెలిసి, నటిగా ఆమెకి గల అనుభవాన్ని అంచనా వేసుకున్నారు.

 ఆ తరువాత కీర్తి సురేశ్ వరుసగా నాయిక ప్రధానమైన పాత్రలను పోషించిందిగానీ, అవి ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఆ జాబితాలో 'గుడ్ లక్ సఖి' .. 'మిస్ ఇండియా' .. 'పెంగ్విన్' వంటి సినిమాలు కనిపిస్తాయి. వరుస ఫ్లాపులు చూసిన ఆమె, 'సర్కారువారి పాట' .. 'దసరా' సినిమాలతో దార్లోపడిపోయింది. 

అలాంటి కీర్తి సురేశ్ ఇప్పట్లో నాయిక ప్రధానమైన సినిమాలు చేయదని చాలామంది అనుకున్నారు. ఇప్పట్లో అలాంటి సినిమాలు చేయకూడదని కీర్తి సురేశ్ కూడా అనుకుందట. కానీ 'నేను లోకల్'తో హిట్ ఇచ్చిన కారణంగా .. దిల్ రాజు మాట కాదనలేక ఆమె ఈ ప్రాజెక్టుకు ఓకే చెప్పేసిందని టాక్. ఈ సినిమాతో కొత్త దర్శకుడు పరిచయమవుతున్నాడని అంటున్నారు. ఒక ముఖ్యమైన పాత్రలో సుహాస్ కనిపించనున్నాడని చెబుతున్నారు. 
Keerthi Suresh
Dil Raju
Suhas

More Telugu News