Team India: డబ్ల్యుటీసీ 2023-25 టీమిండియా మ్యాచ్ షెడ్యూల్ ఇదే!
- జులైలో విండీస్ తో టీమిండియా రెండు టెస్ట్‌ల సిరీస్ తో ఆరంభం
- ఈసారి 19 టెస్టులు ఆడనున్న భారత జట్టు
- స్వదేశంలో పది, విదేశాల్లో తొమ్మిది టెస్టులు
టీమిండియా మరికొన్ని రోజుల్లో WTC 2023-25 సైకిల్ ను ప్రారంభించనుంది. వచ్చే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ లో భారత జట్టు మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. జులైలో విండీస్ తో టీమిండియా రెండు టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది. ఈసారి భారత జట్టు 19 టెస్టులు ఆడనుంది. స్వదేశంలో ఇంగ్లాండ్ తో ఐదు, బంగ్లాదేశ్ తో రెండు, న్యూజిలాండ్ తో మూడు టెస్టులు ఆడనుంది. వెలుపల విండీస్ తో రెండు, దక్షిణాఫ్రికాతో రెండు, ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులు ఆడనుంది.
* జులై 12 నుండి జులై 16 వరకు డొమినికాలో, జులై 20 నుండి జులై 24 వరకు ట్రినిడాడ్ లో వెస్టిండీస్ తో భారత జట్టు తలపడనుంది.
* డిసెంబర్ 2023 - జనవరి 2024 మధ్య సౌతాఫ్రికాతో రెండు టెస్టులు ఆడుతుంది.
* జనవరి - ఫిబ్రవరి 2024 నెలల్లో ఇంగ్లాండ్... భారత్ లో పర్యటిస్తుంది. 5 టెస్టులు జరగనున్నాయి.
* సెప్టెంబర్ - అక్టోబర్ 2024లో బంగ్లాదేశ్... భారత్ లో పర్యటిస్తుంది. రెండు టెస్టులు జరుగుతాయి.
* అక్టోబర్ - నవంబర్ 2024 మధ్య న్యూజిలాండ్... భారత్ లో పర్యటిస్తుంది. మూడు టెస్టులు ఉంటాయి.
* నవంబర్ 2024 - జనవరి 2025లో ఆస్ట్రేలియాలో భారత్ పర్యటిస్తుంది. ఐదు టెస్టులు జరుగుతాయి.