NASA: అంగారకుడిపై సూర్యోదయం వ్యూ అద్భుతం.. మీరూ చూసేయండి!

NASA Shares Panoramic Postcard Capturing Morning And Afternoon Views From Mars
  • క్యూరియాసిటీ రోవర్ తీసి పంపిన ఫొటోలను విడుదల చేసిన నాసా
  • సూర్యోదయం, సూర్యాస్తమయాన్ని కలిపి ఒకే ఫ్రేంలో బంధించిన రోవర్
  • ఓ పర్వతం పైనుంచి ఈ ఫొటో తీసినట్లు వెల్లడించిన సైంటిస్టులు
ఉదయించే సూర్యుడిని చూడడం అనిర్వచనీయ అనుభూతి కలిగిస్తుంది.. ప్రశాంతమైన వాతావరణంలో సూర్యోదయం చూసేందుకు ప్రకృతి ప్రేమికులు ఎక్కడెక్కడికో వెళుతుంటారు. ఇక సముద్రపు ఒడ్డున సూర్యోదయం చూడడం గురించి చెప్పనక్కర్లేదు. మరి, అంగారక గ్రహంపై సూర్యోదయం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే నాసా విడుదల చేసిన ఫొటోలు చూడాల్సిందే. అంగారకుడిపై పరిశోధనల కోసం నాసా పంపించిన క్యూరియాసిటీ రోవర్ ఈ అద్భుతమైన ఫొటోలను తీసి పంపించింది. సూర్యోదయంతో పాటు సూర్యాస్తమయాన్ని కలిపి (పనోరమిక్ వ్యూ) ఫొటోలు తీసింది.  

స్థానిక అంగారక కాలమాన ప్రకారం, ఏప్రిల్ 8న ఉదయం 9:20 గంటలకు సూర్యోదయాన్ని, మధ్యాహ్నం 3:40 గంటలకు సూర్యాస్తమయాన్ని కలిపి క్యూరియాసిటీ రోవర్ ఈ ఫొటోలు తీసింది. ఈ ఫొటో తీసే సమయానికి గేల్ క్రేటర్ అనే పర్వతంపై రోవర్ ప్రయాణిస్తోందని, రోవర్ కు అమర్చిన నేవిగేషన్ కెమెరాలతో ఫొటోలు తీసిందని నాసా శాస్త్రవేత్తలు చెప్పారు. అంగారకుడి ఉపరితలం పైనుంచి ఈ పర్వతం సుమారు 5 కిలోమీటర్ల ఎత్తు ఉంటుందట. ఆ కొండ పైనుంచి సూర్యోదయం, సూర్యాస్తమయం అద్భుతంగా కనిపిస్తోందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు కూడా అద్భుతమనే కామెంట్ చేస్తున్నారు.
NASA
Mars
panoramic view
Curiosity Rovar
morning
evening

More Telugu News