Coins: కర్నూలు జిల్లాలో ఇంటి కోసం పునాదులు తవ్వుతుంటే...!
- హోళగుంద మండలం ఎల్లార్తి గ్రామంలో ఘటన
- కొత్త ఇంటిని నిర్మించుకుంటున్న శరణ బసప్ప అనే వ్యక్తి
- పునాదుల్లో ఓ బిందె లభ్యం
- బిందెలో బ్రిటీష్ కాలం నాటి నాణేలు
కర్నూలు జిల్లాలో ఓ ఇంటి కోసం పునాదులు తవ్వుతుంటే ఓ లోహపు పాత్ర బయటపడింది. అందులో పురాతన నాణేలు లభ్యమయ్యాయి. కర్నూలు జిల్లా హోళగుంద మండలం ఎల్లార్తి గ్రామంలో నివసించే శరణ బసప్ప కొత్త ఇంటిని నిర్మించుకునే ప్రయత్నంలో పునాదులు తవ్విస్తున్నాడు. కొంత లోతుగా తవ్విన తర్వాత ఓ చిన్న బిందె వంటి పాత్ర కనిపించింది.
దీనిపై సమాచారం అందుకున్న అధికారులు శరణ బసప్ప ఇంటి వద్దకు వచ్చి ఆ బిందెను స్వాధీనం చేసుకున్నారు. ఆ బిందెలో ఏం ఉన్నాయో అని అందరూ ఆసక్తిగా చూశారు. అందులో బ్రిటీష్ పాలన కాలం నాటి వెండి, రాగి నాణేలు కనిపించాయి. అవి 1897, 1900 సంవత్సరంలో ముద్రితమైన నాణేలు అని గుర్తించారు. వీటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.