YS Avinash Reddy: కీలక డాక్యుమెంట్లతో సీబీఐ విచారణకు అవినాశ్ రెడ్డి.. 20 నిమిషాలకే వెళ్లిపోయిన ఎంపీ
- విచారణకు హాజరు కావాలంటూ నిన్న నోటీసులిచ్చిన సీబీఐ
- పలు డాక్యుమెంట్స్ తీసుకురావాలని సూచించిన అధికారులు
- డాక్యుమెంట్లతోపాటు ఇవాళ విచారణకు హాజరైన అవినాశ్ రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ఆదివారం కూడా సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఉదయం 10:30 గంటలకు సీబీఐ ఆఫీసుకు ఆయన చేరుకున్నారు. తనతోపాటు కొన్ని కీలక డాక్యుమెంట్స్ ను వెంట తీసుకొచ్చారు. 20 నిమిషాల తర్వాత అవినాశ్ రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఆదివారం విచారణకు రావాలంటూ సీబీఐ అధికారులు శనివారం అవినాశ్ రెడ్డికి నోటీసులిచ్చారు. పలు డాక్యుమెంట్స్ తీసుకు రావాలని ఆయనకు సూచించారు. ఈ నేపథ్యంలోనే డాక్యుమెంట్స్‌తో సీబీఐ కార్యాలయానికి అవినాశ్ వచ్చారు.
మరోవైపు అవినాశ్ రెడ్డిని అరెస్టు చేయకుండా తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. జూన్ చివరి వరకు.. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సీబీఐ విచారణకు హాజరు కావాలని అవినాశ్ ను కోర్టు ఆదేశించింది. ఇక అవినాశ్ ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వైఎస్ వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.