Nithin: లవర్స్ అంటే ఇలా ఉండాలి .. వాళ్ల మధ్య ఇగోలు ఈ రేంజ్ లో ఉండాలి!
- 'భీష్మ'తో హిట్ కొట్టిన నితిన్
- మళ్లీ అదే కాంబినేషన్లో మరో సినిమా
- లవ్ .. కామెడీ .. రొమాన్స్ నేపథ్యంలో సాగే కథ
- హిట్ తప్పదనే నమ్మకంతో ఉన్న నితిన్
నితిన్ - రష్మిక - వెంకీ కుడుముల కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతోంది. గతంలో ఈ ముగ్గురు కాంబినేషన్లో వచ్చిన 'భీష్మ' భారీ విజయాన్ని నమోదు చేసింది. రికార్డుస్థాయి వసూళ్లను రాబట్టింది. అటు నితిన్ కెరియర్ కీ .. ఇటు రష్మిక కెరియర్ కి ఈ సినిమా చాలా హెల్ప్ అయింది. ఈ సినిమా తరువాత నితిన్ కి ఆ స్థాయి హిట్ పడలేదు.
దాంతో ఆయన వెంకీ కుడుములతోనే మరో ప్రాజెక్టును సెట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు దశలోనే ఉంది. ఈ సినిమా కూడా లవ్ .. కామెడీ .. రొమాన్స్ టచ్ తో నడుస్తుంది. ఫస్టాఫ్ అంతా కూడా లవ్ అంటే ఇలా ఉండాలి .. లవర్స్ అంటే ఇలా ఉండాలి అనుకునేలా ఈ కథ నడుస్తుందట.
ఇక సెకండాఫ్ విషయానికి వస్తే, లవర్స్ మధ్య ఇగో ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? ఏ స్థాయివరకూ వెళతాయి? అనేది ఫన్ ను జోడించి చూపిస్తున్నారట. 'భీష్మ' మాదిరిగానే ఈ సినిమా నాన్ స్టాప్ గా నవ్విస్తూ వెళుతుందని అంటున్నారు. మైత్రీ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమా, నితిన్ కి గట్టి హిట్ తెచ్చిపెడుతుందేమో చూడాలి.