Sudhakar: మా అబ్బాయితో మెగాస్టార్ చెప్పినమాట అదే: కమెడియన్ సుధాకర్

Sudhakar interview
  • ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా వెలిగిన సుధాకర్ 
  • తన కొడుకును ఇండస్ట్రీకి తీసుకొచ్చే ఆలోచన 
  • కేరక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతాడంటూ వ్యాఖ్య 
  • మెగాస్టార్ కూడా మాట ఇచ్చారని వెల్లడి
సుధాకర్ హీరోగా తమిళంలో చాలా సినిమాలు చేశారు. ఆ తరువాత తెలుగులో స్టార్ కమెడియన్ అనిపించుకున్నారు. ఒకానొక సమయంలో ఆయన లేని సినిమా ఉండేది కాదు. అంతలా ఆయన తన మార్క్ కామెడీతో ప్రభావితం చేశారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "ప్రస్తుతం నేను ఇంటిపట్టునే ఎక్కువగా ఉంటున్నాను .. ఎక్కువగా టీవీ చూస్తుంటాను. నా పాత సినిమాలు చూసినప్పుడు 'బాగానే చేశానే' అనుకుని సంతోషపడుతూ ఉంటాను" అన్నారు.

 "చాలామంది దర్శకులు నన్ను ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. నా కోసం తమ సినిమాల్లో ప్రత్యేకమైన పాత్రలను డిజైన్ చేయించేవారు. ఈ రోజున నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం వారే. ఇకపై ఇండస్ట్రీకి మా అబ్బాయిని పరిచయం చేద్దామని అనుకుంటున్నాను. హీరోగా చాలా పోటీ ఉంటుంది గనుక, కేరక్టర్ ఆర్టిస్టుగానే తాను ఎదగాలని అనుకుంటున్నాడు" అని అన్నారు.

 ఆ మధ్య మా వాడిని చిరంజీవిగారి ఇంటికి తీసుకెళ్లి వాడి గురించి చెప్పాను. తను తప్పకుండా ఎంకరేజ్ చేస్తానని చెప్పారు. "మేమంతా కష్టపడి పైకి వచ్చాము .. క్రమశిక్షణతో నడచుకుంటూ ఎదిగాము. నువ్వు కూడా అలాగే కష్టపడాలి .. పాత సినిమాలు ఎక్కువగా చూస్తుండు" అంటూ మా వాడికి కొన్ని సూచనలు చేశారు" అంటూ చెప్పుకొచ్చారు.   

Sudhakar
Actor
Chiranjeevi
Tollywood

More Telugu News