Yukthi Tareja: తెలుగు తెరకు పరిచయమవుతున్న మరో అందాల సుందరి!

Yukthi Tareja Special

  • టాలీవుడ్ లో అడుగుపెడుతున్న యుక్తి తరేజా 
  • మోడలింగ్ వైపు నుంచి నటన వైపుకు 
  • 'రంగబలి' ద్వారా పరిచయమవుతున్న బ్యూటీ 
  • జులై 7వ తేదీన సినిమా విడుదల  

తెలుగు తెరకి ఈ మధ్యకాలంలో చాలా మంది కథానాయికలు పరిచయమయ్యారు. అయితే ఆ సినిమాలు వారి కెరియర్ కి ఎంతమాత్రం హెల్ప్ కాలేకపోయాయి. దాంతో ఆ హీరోయిన్స్ అంతా కూడా సెకండ్ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. 

అయితే వాళ్లలో ఆషిక రంగనాథ్ గ్లామర్ పరంగా ఎక్కువ మార్కులు కొట్టేసింది. ఆమె తొలి సినిమాగా వచ్చిన 'అమిగోస్' ఫ్లాప్ అయినప్పటికీ, ఈ బ్యూటీని అంతా గుర్తుపెట్టుకున్నారు. ఇక ఇప్పుడు మరో బ్యూటీ తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది. ఆ సుందరి పేరే 'యుక్తి తరేజా'. మోడలింగ్ వైపు నుంచి సినిమాల దిశగా అడుగులు వేసింది. 

'రంగబలి' సినిమాతో ఈ సుందరి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. నాగశౌర్య హీరోగా నటించిన ఈ సినిమాలో ఆయన జోడీగా కనిపించనుంది. పవన్ బసంశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాను, జులై 7వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో యుక్తి తరేజాకి హిట్ పడుతుందేమో చూడాలి. 

  • Loading...

More Telugu News