Prabhas: 'ప్రాజెక్టు K'లో విలన్ పాత్రధారి పారితోషికం 100 కోట్లు?

Project K movie update
  • షూటింగు దశలో 'ప్రాజెక్టు K'
  • పాన్ వరల్డ్ స్థాయి సినిమా ఇది 
  • నార్త్ నుంచి భారీ తారాగణం 
  • సౌత్ నుంచి విలన్ గా కమలహాసన్
ప్రభాస్ ఇప్పుడు 'సలార్' సినిమా చేస్తూనే మరోపక్క 'ప్రాజెక్టు K' చేస్తున్నాడు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై నాగ్ అశ్విన్ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఇది పాన్ ఇండియా కాదు ... పాన్ వరల్డ్ సినిమా అనే మాట ఆయన ఆరంభంలోనే చెప్పారు. 

అలాంటి ఈ సినిమాలో కథానాయికగా దీపిక పడుకొణె నటిస్తోంది. ఇతర ముఖ్యమైన పాత్రలలో అమితాబ్ .. అనుపమ్ ఖేర్ .. దిశ పటానీ కనిపించనున్నారు. నార్త్ నుంచి భారీ తారాగణం ఉండటం వలన, విలన్ ను సౌత్ నుంచి తీసుకోవాలనే నిర్ణయానికి మేకర్స్ వచ్చారట. ఈ విషయం కూడా ఇంతకుముందే బయటికి వచ్చింది. 

అదే ఇప్పుడు నిజమనేది తాజాగా వినిపిస్తున్న టాక్. సౌత్ నుంచి విలన్ పాత్ర కోసం కమల్ ను సంప్రదించడం .. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయని అంటున్నారు. ఈ సినిమా కోసం ఆయన 30 రోజులు కేటాయించారట. ఇందుకోసం ఆయన 100 కోట్ల పారితోషికాన్ని అందుకోనున్నట్టు చెబుతున్నారు. విలన్ గా కమల్ విశ్వరూప విన్యాసం ఎలా ఉంటుందో చూడాలి మరి!

Prabhas
Deepika Padukone
Amitabh Bachchan
Kamal Haasan

More Telugu News