brs: మొక్కలు పెంచాలంటూ ఢిల్లీ హైకోర్టు వినూత్న తీర్పు.. సంతోష్ కుమార్ ట్వీట్

BRS MP Santhosh Kumar tweet on High Court judgement

  • 2017లో కేసులో 10 మొక్కలు పెంచి, పదేళ్ల పాటు సంరక్షించాలని హైకోర్టు తీర్పు
  • ప్రతి ఏడాది మొక్కల స్టేటస్ రిపోర్ట్ పంపించాలని ఆదేశం
  • ఢిల్లీ హైకోర్టు తీర్పు పట్ల సంతోష్ కుమార్ హర్షం

ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఓ తీర్పు బీఆర్ఎస్ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ను ఆకర్షించింది. ఈ వార్తకు సంబంధించిన క్లిప్పింగ్ ను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేసిన సంతోష్.. ఇది చారిత్రాత్మక తీర్పు అని పేర్కొన్నారు.

'ఢిల్లీ హైకోర్టు వినూత్న తీర్పు ఇచ్చింది. 2017లో హోలీ సంద‌ర్భంగా గొడ‌వ‌కు కార‌ణ‌మైన వ్య‌క్తికి ఢిల్లీ కోర్టు ఆస‌క్తిక‌ర‌మైన శిక్ష విధించింది. 10 మొక్క‌లు నాటి 10 ఏళ్ల పాటు సంర‌క్షించాల‌ని న్యాయస్థానం ఆదేశించింది. ప్ర‌తి ఏడాది ఆ మొక్క‌ల స్టేట‌స్ రిపోర్ట్ స‌మ‌ర్పించాల‌ని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పార్టీలు కాంప్రమైజ్ కావడంతో ఎఫ్ఐఆర్ ను కొట్టి వేసింది. ఇలాంటి అద్భుతమైన తీర్పు ఇచ్చిన జడ్జికి కూడోస్" అంటూ సంతోష్ కుమార్ ట్వీట్ చేశారు. ఢిల్లీ హైకోర్టు తీర్పును సంతోష్ కుమార్ స్వాగ‌తించారు.

  • Loading...

More Telugu News