trains cancelled: నేడు హైదరాబాద్- విశాఖ మధ్య పలు రైళ్ల రద్దు
- రేపు కూడా పలు రైళ్ల క్యాన్సిల్
- 11 సర్వీసులు రద్దు చేసిన అధికారులు
- డివిజన్లలో జరుగుతున్న పనుల కోసమేనని వెల్లడి
హైదరాబాద్, విశాఖ మధ్య పలు డివిజన్లలో ట్రాక్ మరమ్మతు సహా భద్రతాపరమైన పనులు కొనసాగుతున్నాయని రైల్వే అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఈ రెండు నగరాల మధ్య నడిచే పలు సర్వీసులను బుధ, గురు వారం (నేడు, రేపు) రద్దు చేసినట్లు వివరించారు. రెండు రోజుల్లో మొత్తం 11 రైళ్లను రద్దు చేసినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం ఏకే త్రిపాఠి పేర్కొన్నారు. ఈమేరకు రద్దయిన రైళ్ల వివరాలతో ఓ ప్రకటన విడుదల చేశారు.
జూన్ 21 నాడు రద్దయిన రైళ్లు..
పుదుచ్చేరి-హావ్‌డా (12868)
షాలిమార్-హైదరాబాద్ (18045)
హైదరాబాద్-షాలిమార్ ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ (18046)
విశాఖ-షాలిమార్ (22854)
షాలిమార్-సికింద్రాబాద్ (12773)
ఎంజీఆర్ చెన్నై సెంట్రల్-షాలిమార్ (22826)
హావ్‌డా-సత్యసాయి ప్రశాంతి నిలయం (22831)
తాంబరం-సంత్రాగచ్చి (22842)
షాలిమార్-సికింద్రాబాద్ (22849)
22న గురువారం..
ఎంజీఆర్ చెన్నై సెంట్రల్-సంత్రాగచ్చి (22808)
ఎస్‌ఎంవీ బెంగళూరు-హావ్‌డా (22888)