Telangana: ఆసియాలోనే అతి పెద్ద ఇళ్ల సముదాయాన్నిప్రారంభించిన కేసీఆర్

KCR inaugurates largest housing complex in Asia

  • సంగారెడ్డి జిల్లా కొల్లూరులో 60 వేల మంది నివాసం ఉండేలా నిర్మాణం
  • దాదాపు 15 వందల కోట్లు ఖర్చు చేసి 15,660 డబుల్ బెడ్రూం ఇళ్లు
  • సముదాయానికి కేసీఆర్ నగర్‌‌ గా పేరు

తెలంగాణ ప్రభుత్వం సంగారెడ్డి జిల్లా కొల్లూరులో చేపట్టిన ఆసియాలోనే అతి పెద్దదైన డిగ్నిటీ హౌసింగ్‌ కాలనీని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించారు. సుమారు 60 వేల మంది ఆవాసం ఉండేలా ఒకేచోట ఏకంగా 15,660 ఇళ్లను ప్రభుత్వం నిర్మించింది. నిరుపేదల కోసం సకల సౌకర్యాలతో కొల్లూరులో ఈ ఆదర్శ టౌన్‌షిప్‌ కోసం రూ.1,489.29 కోట్లు ఖర్చు చేసింది. ఈ భారీ ప్రాజెక్టులో కార్పొరేట్‌ అపార్ట్‌మెంట్లకు తీసిపోకుండా సకల హంగులతో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను నిర్మించారు.

 ఈ డబుల్ బెడ్ రూం ఇళ్ల గృహ సముదాయానికి కేసీఆర్‌ నగర్‌ అని పేరు పెట్టారు. గురువారం దీన్ని ప్రారంభించిన కేసీఆర్ ఆరుగురు లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను అందజేశారు. అంతకుముందు డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌ రావు, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, వేముల ప్రశాంత్‌ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News