Shivraj Singh Chouhan: మోదీ ప్రపంచ స్థాయి నేత.. వీళ్ల వల్ల ఏమీ కాదు: శివ్ రాజ్ సింగ్ చౌహాన్

Modi will come into power with huge majority says Shivraj Singh Chouhan
  • ఈరోజు పాట్నాలో భేటీ అవుతున్న విపక్ష నేతలు
  • మోదీ పాప్యులారిటీ విదేశాలకు సైతం పాకిందన్న చౌహాన్
  • భారీ మెజార్టీలో మోదీ మరోసారి అధికారంలోకి వస్తారని ధీమా
పాట్నాలో ఈరోజు జరగనున్న విపక్షాల సమావేశాన్ని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివ్ రాజ్ సింగ్ చౌహాన్ చాలా లైట్ గా తీసుకున్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాని మోదీ అత్యధిక మెజార్టీతో మరోసారి అధికారంలోకి వస్తారని చెప్పారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని స్మార్ట్ సిటీ పార్క్ లో ఈరోజు ఆయన మొక్కలను నాటారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మోదీ ప్రపంచ స్థాయి నాయకుడని అన్నారు. మోదీ పాప్యులారిటీ మన దేశంలోనే కాకుండా విదేశాలకు సైతం పాకిందని చెప్పారు. విదేశాల్లోని ప్రజలు కూడా మోదీని నమ్ముతున్నారని, అభిమానిస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మోదీ నాయకత్వంలోని బీజేపీ గత రికార్డులను కూడా బద్దలు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల గురించి కొందరు గాల్లో మేడలు కడుతున్నారని, మోదీని ఓడిస్తామని కలలు కనే వారిని అలాగే వదిలేద్దామని చెప్పారు. మోదీని ఓడించడం వీళ్ల వల్ల కాదని అన్నారు.
Shivraj Singh Chouhan
Narendra Modi
BJP
Oppostion Parties Meeting

More Telugu News