Tollywood: క్రేజీ కాంబినేషన్.. చైతూ సరసన కీర్తి!

Keerthy Suresh to pair up with Naga Chaitanya
  • చందు మొండేటి దర్శకత్వంలో రాబోతున్న సినిమా
  • మహానటిలో అతిథి పాత్రలో నటించిన నాగ చైతన్య
  • ఇటీవల వరుస ఫెయిల్యూర్ తో ఇబ్బంది పడుతున్న హీరో
అక్కినేని నట వారసుడు నాగ చైతన్య ఇటీవల వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్నాడు. ఆయన గత చిత్రాలు థ్యాంక్‌ యూ, కస్టడీ బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి. దాంతో, ఎలాగైనా హిట్ అందుకొని మళ్లీ విజయాల బాట పట్టాలని చూస్తున్నాడు. ఈ క్రమంలో ‘కార్తికేయ 2’తో ప్యాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్న యువ దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వంలో చేయబోతున్న సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఇదివరకు ప్రేమమ్‌, సవ్యసాచి సినిమాలు వచ్చాయి. చందుతో మూడో చిత్రంలో చై సరసన తొలుత అనుపమ పరమేశ్వరన్‌ను హీరోయిన్ గా అనుకున్నట్టు వార్తలు వచ్చాయి. 

అయితే, ఇప్పుడు కీర్తిసురేశ్‌ పేరు తెరపైకి వచ్చింది. ఇటీవలే నానితో కలిసి నటించిన దసరా చిత్రంతో భారీ విజయం సొంతం చేసుకున్న కీర్తిని తీసుకుంటే బాగుంటుందని దర్శకుడు, నిర్మాత అల్లు అరవింద్ నిర్ణయించారని సమాచారం. కథ చెప్పగా కీర్తి సురేశ్ కూడా గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చినట్టేనని వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మహానటి చిత్రంలో అతిథి పాత్ర చేసిన నాగ చైతన్య.. కీర్తితో కలిసి నటించారు. ఇప్పుడు ఇద్దరు జంటగా నటిస్తే మరో క్రేజీ కాంబినేషన్ అభిమానులను అలరించనుంది.
Tollywood
Naga Chaitanya
Keerthy Suresh
chandu mondety

More Telugu News