little bundle of joy: అన్న రామ్ చరణ్ తండ్రి కావడంపై నీహారిక స్పందన

Ram Charan cousin Niharika Konidela calls his daughter little bundle of joy
  • రామ్ చరణ్ ను ఎంతో ప్రేమ, శ్రద్ధ కలిగిన వ్యక్తిగా పేర్కొన్న నీహారిక
  • ఉపాసన దృఢమైన మహిళగా అభివర్ణన 
  • వారి సంరక్షణలో బేబీ సురక్షితంగా ఉంటుందన్న అభిప్రాయం
రామ్ చరణ్ తేజ్, ఉపాసన ఇటీవలే తల్లిదండ్రులయ్యారు. పండంటి బిడ్డను ఉపాసన ప్రసవించింది. దీంతో చిరంజీవి ఇంట్లో సంతోషకర వాతావరణం నెలకొంది. వివాహం అయిన 11 ఏళ్ల తర్వాత వీరి జీవితంలో ఓ చిట్టితల్లి రావడంతో రామ్ చరణ్ తేజ్ దంపతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ తరుణంలో అన్న రామ్ చరణ్ తేజ్ కు చెల్లెలు నీహారిక కొణిదెల శుభాకాంక్షలు తెలియజేసింది. 

నీహారికా కూడా అపోలో హాస్పిటల్ కు వెళ్లి ఉపాసన, బేబీని చూసి వచ్చింది. టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా నీహారిక దీనిపై స్పందించింది. ఆనందాల చిన్ని మూట అంటూ అభివర్ణించింది. ‘‘చరణ్ అన్న ఎంతో ప్రేమ, శ్రద్ధ కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి మరొకరు ఉండరు. ఉపాసన ఎంతో దృఢమైన వ్యక్తి. వారి సంరక్షణలో బేబీ సురక్షితంగా ఉంటుంది. వారు గొప్ప తల్లిదండ్రులు అవుతారని నేను కచ్చితంగా చెప్పగలను’’ అని నీహారిక తన అభిప్రాయాలను పంచుకుంది.
little bundle of joy
Niharika Konidela
Ram Charan
upasana

More Telugu News