petrol: పెట్రోల్, డీజిల్ ధరలపై గుడ్‌న్యూస్.. వచ్చే రెండు నెలల్లో తగ్గే ఛాన్స్
- నవంబర్-డిసెంబర్ నుండి కీలక రాష్ట్రాల ఎన్నికలు
- చమురు మార్కెటింగ్ కంపెనీలు తగ్గించే అవకాశం
- లీటర్ పై రూ.5 వరకు ధరలు తగ్గే అవకాశం
పెట్రోల్, డీజిల్ ధర తగ్గింపుకు సంబంధించి వినియోగదారులకు త్వరలో శుభవార్త అందనుంది. నివేదికల ప్రకారం రానున్న నెలల్లో ఇంధన ధరలు తగ్గే అవకాశం ఉంది. నవంబర్-డిసెంబర్ నుండి జరిగే కీలక రాష్ట్రాల ఎన్నికల దృష్ట్యా చమురు మార్కెటింగ్ కంపెనీలు ఆగస్ట్ నుండి పెట్రోల్ మరియు డీజిల్ ధరలను లీటరుకు రూ. 4-5 తగ్గించవచ్చునని వార్తలు వస్తున్నాయి.
పెట్రోల్, డీజిల్ ధరలు పలు రాష్ట్రాల్లో తక్కువగా ఉన్నప్పటికీ, కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నాయి. ఆయా రాష్ట్రాలు వ్యాట్ తగ్గించడంతో కొన్ని రాష్ట్రాల్లో ధరలు తక్కువగా ఉన్నాయి. అయితే పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకు వస్తే ధరలు చాలా తగ్గుతాయనే అభిప్రాయాలు ఉన్నాయి. చమురును జీఎస్టీ పరిధిలోకి తేవాలనే డిమాండ్ చాలాకాలంగా ఉంది.