Vijay Sai Reddy: టీడీపీ సభావేదిక కూలిపోవడంపై విజయసాయిరెడ్డి స్పందన

Vijayasai Reddy reacts on TDP rally stage collapse
  • నిన్న బత్తులవారిగూడెంలో కుప్పకూలిన టీడీపీ సభావేదిక
  • ఆ సమయంలో వేదికపై ప్రసంగిస్తున్న చినరాజప్ప... వేదికపై ఉన్న చింతమనేని
  • ముందుకు పడిపోయిన చినరాజప్ప
  • వచ్చే ఎన్నికల్లో విపక్షాల పతనానికి సంకేతాలన్న విజయసాయి
నిన్న ఏలూరు జిల్లా నూజివీడు మండలం బత్తులవారిగూడెంలో టీడీపీ కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకోవడం తెలిసిందే. ఈ సభలో మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రసంగిస్తుండగా ఈదురుగాలులు వీయడంతో సభావేదిక కుప్పకూలింది. దాంతో చినరాజప్పతో పాటు వేదికపై ఉన్న చింతమనేని ప్రభాకర్ తదితర టీడీపీ నేతలు కిందపడిపోయారు. 

దీనిపై వైసీపీ అగ్రనేత విజయసాయిరెడ్డి స్పందించారు. స్టేజి కూలడం బాధాకరమని పేర్కొన్నారు. వరుస అపశ్రుతులు 2024 ఎన్నికల్లో విపక్షాల పతనానికి సంకేతాలా? అని ట్వీట్ చేశారు. ఈ మేరకు స్టేజి కూలిపోయిన వీడియోను కూడా పోస్ట్ చేశారు.
Vijay Sai Reddy
TDP Meeting
Stage
Collapse
Bathulavarigudem
Eluru District
YSRCP
Andhra Pradesh

More Telugu News