Russia: బెలారస్‌కు వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్.. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకే..

Wagner group chief Yevgeny Prigozhin will move to Belarus to avoid arrest

  • రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు నిద్రలేకుండా చేసిన ప్రిగోజిన్
  • రంగంలోకి దిగిన పుతిన్ మిత్రుడు, బెలారస్ అధ్యక్షుడు
  • ప్రిగోజిన్‌తో చర్చలు సఫలం
  • తిరుగుబాటులో పాల్గొనని యోధులకు రక్షణశాఖ నుంచి కాంట్రాక్ట్ లభిస్తుందన్న క్రెమ్లిన్

రష్యా అధ్యక్షుడు  వ్లాదిమిర్ పుతిన్‌ను వణికించిన వాగ్నర్ కిరాయి సైన్యం కమాండర్ అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు పొరుగునే ఉన్న బెలారస్ వెళ్లనున్నట్టు సమాచారం. మాస్కో వైపుగా దళాలను నడిపించి పుతిన్‌కు హెచ్చరికలు  జారీ చేసిన యెవ్‌గెనీ ప్రిగోజిన్ సంక్షోభానికి తెరదించే ఒప్పందంలో భాగంగా బెలారస్ వెళ్తున్నట్టు క్రెమ్లిన్ తెలిపింది. ఆయనతో ముందుకు నడిచిన దళాలపైనా ప్రాసిక్యూషన్ ఉండబోదని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెక్సోవ్ పేర్కొన్నారు. అంతేకాదు, తిరుగుబాటులో వాగ్నర్ గ్రూపుతో ముందుకు నడవని యోధులకు రక్షణ శాఖలో కాంట్రాక్ట్ లభిస్తుందని చెప్పడం గమనార్హం.

వాగ్నర్ కిరాయి సైన్యం తిరుగుబాటుతో రష్యాలో ఒక్కసారిగా కలకలం రేపింది. ఇది అంతర్యుద్ధానికి కూడా దారితీసే అవకాశం ఉందని భావించారు. దేశాన్ని రక్షించుకునేందుకు ఏం చేయడానికైనా సిద్ధమని పుతిన్ కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందోనని ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూసింది. అయితే, పుతిన్ మిత్రుడు, బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో మధ్యవర్తిత్వం వహించి సంక్షోభానికి ముగింపు పలికారు.

ఒప్పందం కుదిరిన తర్వాత మాస్కో వైపుగా కదులుతున్న దళాలను ఆగిపోవాలని కిరాయి సైన్యం కమాండర్ ప్రిగోజిన్ ఆదేశించడంతో సంక్షోభానికి ఫుల్‌స్టాప్ పడింది. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో  వాగ్నర్ సైన్యం కీలక పాత్ర పోషిస్తోంది. అయితే, రష్యా సైన్యం నుంచి సరైన సహకారం అందడం లేదని ఆరోపిస్తూ ప్రిగోజిన్ తిరుగుబాటుకు తెరలేపారు. వారి డిమాండ్లలో ముఖ్యమైన రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగును తొలగించాలన్న డిమాండ్‌పై క్రెమ్లిన్ స్పందించిందా? లేదా? అన్న విషయాన్ని ప్రిగోజిన్ వెల్లడించలేదు.

పుతిన్‌తో మాట్లాడిన తర్వాత ప్రిగోజిన్‌తో జరిపిన చర్చలు సఫలమయ్యాయని, వాగ్నర్ దళాలకు భద్రతా హామీలతో సహా ప్రతిపాదిత పరిష్కారంలో భాగంగా సేనలను నిలిపివేయడానికి ప్రిగోజిన్ అంగీకరించినట్టు బెలారస్ అధ్యక్షుడు లుకాషెంకో కార్యాలయం తెలిపింది.

  • Loading...

More Telugu News