school kids: స్కూల్ పిల్లలకు లంచ్ లో ఈ పదార్థాలు పెట్టొద్దట..

 How to prepare a healthy lunch box for your kids

  • ఇన్ స్టంట్ నూడుల్స్ తో అనారోగ్య సమస్యలు
  • స్వీట్లు, ఫ్రై చేసిన పదార్థాలను దూరం పెట్టాల్సిందే
  • తాజా పండ్లు, కూరగాయలకు లంచ్ బాక్సులో చోటివ్వాలి
  • పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సిద్ధం చేయాలంటున్న నిపుణులు

వేసవి సెలవులు ముగిశాయి.. స్కూళ్లు తెరుచుకుని పదిహేను రోజులు కావొస్తున్నా ఇప్పుడిప్పుడే క్లాస్ రూంలు నిండుగా కనిపిస్తున్నాయి. భుజాన బ్యాగు, చేతిలో లంచ్ బాస్కెట్లతో పిల్లలు స్కూళ్లకు వెళుతున్నారు. మరి ఆ లంచ్ బాక్సుల్లో ఏం పెడుతున్నారు.. పిల్లలకు ఇష్టమనో లేక వంటింట్లో హడావుడి వల్లో ఫాస్ట్ ఫుడ్ పెడితే మాత్రం పిల్లలను చేజేతులా అనారోగ్యాల పాలు చేస్తున్నట్లేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నూడుల్స్, స్వీట్లు, ఫ్రై చేసిన పదార్థాలు, రాత్రిపూట మిగిలిన ఆహారం వేడి చేసి పెట్టడం లాంటివి మీ పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని అంటున్నారు.

ఇన్ స్టంట్ నూడుల్స్ ను ఇష్టపడని పిల్లలు ఉండరనడంలో అతిశయోక్తి లేదు.. అయితే, మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇన్ స్టంట్ నూడిల్స్ లో చాలావరకు కాలరీస్, ఫైబర్, సోడియం సహా పలు రకాల మైక్రోన్యూట్రియెంట్లు తక్కువ మోతాదులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. పైగా తరచూ నూడుల్స్ తినడం వల్ల గుండె, కిడ్నీలకు సంబంధించిన అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉందంటున్నారు. ఇక నూనెలో బాగా ఫ్రై చేసిన ఆహార పదార్థాలు.. ఫ్రెంచ్ ఫ్రైస్, పొటాటో చిప్స్, ఫ్రైడ్ చికెన్ నగ్గెట్స్ వంటివి పొట్టలోని పేగుల పనితీరుపై చెడు ప్రభావం చూపుతాయట. వీటితో పిల్లలు లావయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, వారికి అవసరమైన న్యూట్రిషన్ ఫుడ్ తో లంచ్ బాక్స్ సిద్ధం చేయాలని సూచిస్తున్నారు. పిల్లలు కోరుకునే రుచితో పాటు ఆరోగ్యకరమైన ఆహారం సమపాళ్లలో ఉండేలా చూసుకోవాలని అంటున్నారు. తాజా కూరగాయలు, పండ్లు, ప్రొటీన్లతో నిండిన శాండ్ విచ్, పాన్ కేకులు, ఇడ్లీలకు లంచ్ బాక్సుల్లో చోటివ్వాలని సలహా ఇస్తున్నారు.

  • Loading...

More Telugu News