Narendra Modi: అత్యున్నత పురస్కారం 'ఆర్డర్ ఆఫ్ నైల్' తో మోదీని సత్కరించిన ఈజిప్టు

Egypt confers PM Modi with Order Of The Nile

  • ఈజిప్టు పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ
  • మోదీ ఖాతాలో మరో విశిష్ట పురస్కారం
  • మోదీకి ఆర్డర్ ఆఫ్ ద నైల్ పురస్కారం బహూకరించిన ఈజిప్టు అధ్యక్షుడు
  • మోదీ ఖాతాలో 13కి పెరిగిన అంతర్జాతీయ అవార్డులు

ప్రధాని నరేంద్ర మోదీ ఖాతాలో మరో అంతర్జాతీయ పురస్కారం చేరింది. ఈజిప్టు పర్యటనలో ఉన్న మోదీని అక్కడి ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ ద నైల్ తో సత్కరించింది. ఈ పురస్కారాన్ని ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సిసీ... ప్రధాని మోదీకి బహూకరించారు. 

తమ దేశానికి, ఇతర మానవాళికి సేవలు చేస్తున్న దేశాధినేతలు, ప్రముఖులను ఈజిప్టు ప్రభుత్వం ఆర్డర్ ఆఫ్ ద నైల్ పురస్కారంతో గౌరవిస్తోంది. కాగా, తాజా పురస్కారంతో ప్రధాని మోదీ ఖాతాలో చేరిన అంతర్జాతీయ అవార్డుల సంఖ్య 13కి పెరిగింది. 

ఇప్పటివరకు మోదీకి లభించిన పురస్కారాల జాబితా ఇదే...

1. ఆర్డర్ ఆఫ్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ (సౌదీ అరేబియా)
2. స్టేట్ ఆఫ్ ద ఘాజీ అమీర్ అమానుల్లా ఖాన్ (ఆఫ్ఘనిస్థాన్)
3. గ్రాండ్ కాలర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ పాలస్తీనా (పాలస్తీనా)
4. ఆర్డర్ ఆఫ్ జయేద్ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్)
5. ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ (రష్యా)
6. ఆర్డర్ ఆఫ్ డిస్టింగ్విష్డ్ రూల్ ఆఫ్ నిషాన్ ఇజుద్దీన్ (మాల్దీవులు)
7. కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ ద రెనేస్సాన్స్ (బహ్రెయిన్)
8. లీజియన్ ఆఫ్ మెరిట్ (అమెరికా)
9. ఆర్డర్ ఆఫ్ ద డ్రక్ గ్యాల్పో (భూటాన్)
10. ఎబాకల్ అవార్డు (పాపువా న్యూ గినియా)
11. కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఫిజి (ఫిజి)
12. కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ లొగోహు (పాపువా న్యూ గినియా)
13. ఆర్డర్ ఆఫ్ ద నైల్ (ఈజిప్టు)

  • Loading...

More Telugu News