Guntur District: నది ఒడ్డున భారీగా నాగ ప్రతిమలు.. గుంటూరు జిల్లాలో కలకలం!

Naga statues on krishna river bank becomes talk of the town in Guntur district

  • సీతానగరం సమీపంలో నది ఒడ్డున భారీగా నాగ ప్రతిమలు
  • స్థానికంగా చర్చనీయాంశమవుతున్న ఘటన
  • అవి పురాతనమైనవా లేక ఎవరైనా విగ్రహాలను ధ్వంసం చేశారా? అని స్థానికుల్లో అనుమానం
  • వాస్తవం ఏంటో తేల్చేందుకు లోతైన దర్యాప్తు జరగాలంటున్న స్థానికులు

గుంటూరు జిల్లాలో కృష్ణా నదీతీరాన నాగ ప్రతిమలు కనిపించడం స్థానికంగా పెద్ద చర్చకు దారి తీసింది. జిల్లాలోని తాడేపల్లి సీతానగరంలో నది ఎగువ భాగాన భారీ సంఖ్యలో నాగ ప్రతిమలు బయటపడ్డాయి. అవి ఎక్కడి నుంచి వచ్చాయో తెలీక స్థానికులు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఇవి పురాతన కాలం నాటివేమో అని ఆరా తీస్తున్నారు. పాడైన విగ్రహాలు తాలూకు భాగాలు అయ్యి ఉండొచ్చని మరికొందరు అనుమానిస్తున్నారు. 

కూల్చేసిన విగ్రహాలను ఇక్కడ ఎవరైనా వదిలి వెళ్లారా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అవి నాగపాము విగ్రహాలు కావడంతో దోషం చుట్టుకోకుండా ఉండేందుకు నదీతీరాన వదిలి వెళ్లి ఉంటారని కొందరు చెబుతున్నారు. వీటి వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసుకునేందుకు లోతైన దర్యాప్తు జరగాలని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అక్కడి నదిలో మరిన్ని విగ్రహాలు ఉంటాయన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.

  • Loading...

More Telugu News