Tomato prices: ‘నైరుతి’ ఆలస్యం.. ఆకాశాన్నంటనున్న టమాటా ధరలు..!

Tomato prices skyrocket due to monsoon delay and deficient rains

  • వర్షాలు లేక కూరగాయల ధరల పెరుగుదల 
  • దేశవ్యాప్తంగా కిలో టమాటా ధర రూ.100 మార్కు దాటే అవకాశం
  • ఉల్లి, బంగాళదుంప మినహా మిగతా కూరగాయల ధరలన్నీ పెరుగుతున్నాయన్న మార్కెట్ వర్గాలు

దేశంలో టమాటా ధరలు వేగంగా పెరుగుతున్నాయి. కిలో టమాటా ధర త్వరలో రూ.100 మార్కు దాటే అవకాశం ఉందని తెలుస్తోంది. నైరుతి రుతుపవనాల రాకలో ఆలస్యం, పలుచోట్ల వర్షాలు తక్కువగా పడుతుండటంతో క్రమంగా టమాటాలు, పప్పు దినుసుల ధరలు పెరుగుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈమారు టమాట సాగు తక్కువగా ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గతేడాది చిక్కుడుకు మంచి ధర పలకడంతో ఈమారు అనేక మంది ఈ పంటసాగువైపు మళ్లారు. దీనికి తోడు వర్షపాతం తక్కువగా ఉండటంతో అనేక ప్రాంతాల్లో పంటలు ఎండిపోయాయి. 

ఉల్లి, బంగాళదుంప మినహా ఇతర కూరగాయల ధరలు పెరిగాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి. మధ్యప్రదేశ్‌లో ఇప్పటికే కూరగాయల ధరలు సామాన్యులను ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. భోపాల్‌లో గతవారంతో పోలిస్తే కిలో టమాటా 10 రూపాయల మేర పెరిగి రూ.100కు చేరుకుంది.

  • Loading...

More Telugu News