Pawan Kalyan: పవన్ కల్యాణ్ ద్వారా ఓట్లు చీల్చాలన్న చంద్రబాబు పాచిక పారలేదు: మంత్రి కొట్టు
- జనసేనాని వారాహి యాత్ర అట్టర్ ఫ్లాప్ అయిందని విమర్శ
- పవన్ వ్యాఖ్యలు ఉన్మాదానికి తక్కువ.. పిచ్చికి ఎక్కువ అని ఎద్దేవా
- ద్వారంపూడి విసిరిన సవాల్ కు తోకముడిచాడన్న మంత్రి
- పవన్ గ్రాఫ్ పదింతలు పడిపోయిందన్న మంత్రి కొట్టు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి కొట్టు సత్యనారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వారాహి యాత్ర అట్టర్ ప్లాప్ అయిందని విమర్శించారు. తన యాత్రలో పవన్ వ్యాఖ్యలు ఉన్మాదానికి తక్కువ, పిచ్చికి ఎక్కువ అన్నట్లుగా ఉన్నాయన్నారు. ఆయన మానసిక పరిస్థితి బాగా లేదని ఎద్దేవా చేశారు. అసలు ఏం మాట్లాడుతారో ఆయనకే అర్థం కాదన్నారు. ద్వారంపూడి విసిరిన సవాల్ కు పవన్ తోకముడిచారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని పవన్ ఎలా చెబుతారని నిలదీశారు. ప్రతి గొడవలోను జనసేన కార్యకర్తలే ఉంటున్నారని ఆరోపించారు.
వారాహితో పవన్ కల్యాణ్ గ్రాఫ్ పదింతలు పడిపోయిందన్నారు. ఆయన సభకు వచ్చే జనాలు వేల సంఖ్య నుండి వందలకు పడిపోతోందన్నారు. పవన్ కల్యాణ్ ద్వారా గోదావరి జిల్లాలో కాపు ఓట్లను చీల్చాలన్న చంద్రబాబు పాచిక పారలేదన్నారు. కాపుల మనోభావాలు దెబ్బతీసేలా ముద్రగడ పద్మనాభంపై అవాకులు చెవాకులు పేలితే ఊరుకునేది లేదన్నారు.