Nifty: తెగ కొనేస్తున్న విదేశీ ఇన్వెస్టర్లు.. రికార్డు స్థాయికి నిఫ్టీ
- నిఫ్టీ, సెన్సెక్స్ ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరిక
- ఏప్రిల్ నుంచి రూ.82వేల కోట్లు ఇన్వెస్ట్ చేసిన విదేశీ ఇన్వెస్టర్లు
- రెండేళ్ల స్థిరీకరణ తర్వాత సానుకూలత
విదేశీ, దేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో ఈక్విటీ మార్కెట్ కొత్త శిఖరాలకు చేరుకుంది. గత ఏడాదిన్నర కాలం పాటు స్థిరీకరణ తర్వాత గత రెండు నెలలుగా ఈక్విటీలు ర్యాలీ చేస్తుండడం తెలిసిందే. ముఖ్యంగా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు విదేశీ ఇన్వెస్టర్లు 10 బిలియన్ డాలర్ల (రూ.82,000 కోట్లు) మేర భారత స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. దీంతో నిఫ్టీ 18,900 రికార్డు స్థాయిని తొలిసారిగా అధిగమించింది.