Nara Lokesh: జగన్ నాటకాన్ని జనం నమ్మి గెలిపించారు... కానీ!: నారా లోకేశ్
- గూడూరు నియోజకవర్గంలో లోకేశ్ యువగళం
- కోటలో బహిరంగ సభ
- సింహపురిలో తాను సింహంలా అడుగుపెట్టానన్న లోకేశ్
- పిల్ల సైకోలు రోడ్లపైకి వచ్చి మొరుగుతున్నాయని విమర్శలు
గూడూరు నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర కొనసాగిస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్... కోటలో నిర్వహించిన బహిరంగసభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సింహపురిలో తాను సింహంలా అడుగుపెట్టానని, యువగళానికి వస్తున్న రెస్పాన్స్ చూసి పిల్ల సైకోలు రోడ్ల మీదకి వచ్చి మొరుగుతున్నాయని విమర్శించారు. పిల్ల కాలువ తవ్వడం రాని సిల్లీ ఫెల్లోస్ అంతా ఛాలెంజ్ చేస్తున్నారని అన్నారు.
చంద్రబాబు హీరో... జగన్ జీరో, చంద్రబాబు సంపద సృష్టికర్త... జగన్ అప్పుల అప్పారావు, చంద్రబాబు అంటే భరోసా... జగన్ అంటే విధ్వంసం అని లోకేశ్ అభివర్ణించారు. జగన్ చెత్త పాలన గురించి వారి ఎమ్మెల్యేలే చెబుతున్నారని విమర్శించారు.
గూడూరు యూత్ దెబ్బకు జంక్షన్ జామైపోయింది!
యువగళం దెబ్బకి సైకో జగన్ కి జ్వరం వచ్చింది. ప్యాలస్ లో టీవీలు పగలగొడుతున్నాడు. గూడూరు యూత్ దెబ్బకి జంక్షన్ జామైపోయింది. రాజులు ఏలిన నేల గూడూరు. అళగనాథ స్వామి దేవాలయం, మల్లం సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉన్న పుణ్యభూమి గూడూరు. ఇక్కడ పండే నిమ్మ, ఇక్కడ పెరిగే రొయ్య రాష్ట్రమంతా ఫేమస్. సహజ వనరులు ఉన్న గొప్ప నేల గూడూరు. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు జన్మించిన నేల గూడూరు. ఘన చరిత్ర ఉన్న ఈ నేలపై నడవడం నా అదృష్టం.
జగన్ పరదాల్లో... లోకేశ్ ప్రజల్లో!
యువగళానికి వస్తున్న ప్రజాధారణ చూసి జగన్ భయపడుతున్నాడు, జగన్ టెన్షన్ పడుతున్నాడు, జగన్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. ఎవరైనా అడ్డొస్తే నేను భయపడే రకం కాదు. జగన్ కి భయాన్ని పరిచయం చేసే రకం. నేను ముందే చెప్పా సాగనిస్తే పాదయాత్ర. అడ్డుకుంటే దండయాత్ర అని. మీ లోకేశ్ ప్రజల్లో ఉంటాడు... జగన్ పరదాల్లో ఉంటాడు. జగన్ సభల్లో జనం ఉండరు... మీ లోకేశ్ సభల్లో ఖాళీ ఉండదు.
చంచల్ గూడా జైల్లో ప్రత్యేక హోదా!
జగన్ నాడు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పాదయాత్ర చేస్తూ ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ప్రారంభించాడు. 25 మంది ఎంపీలను తనకిస్తే కేంద్రం మెడలు వంచి హోదా తెస్తానన్నాడు. జగన్ నాటకాన్ని జనం నమ్మారు... లోక్ సభ, రాజ్య సభ కలిపి 31 ఎంపీ సీట్లు ఇచ్చారు.
కానీ... ప్రత్యేక హోదా సాధించాల్సిన ఆ వైసీపీ ఎంపీలు ఎం చేస్తున్నారో తెలుసా? ఒక ఎంపీ బాబాయ్ ని లేపేసి అరెస్ట్ కాకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. ఒక ఎంపీ జిప్పు విప్పి ఇండియా మొత్తం చూపించాడు. ఒక ఎంపీ యూట్యూబ్ వీడియోలు, రీల్స్ చేస్తూ పూలు చల్లమని అడుక్కుంటున్నాడు. ఒక ఎంపీ ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇరుక్కున్న కొడుకుని కాపాడుకునే పనిలో బిజీగా ఉన్నాడు. ఒక ఎంపీ భార్యా, కొడుకు కిడ్నాప్ అయితే హైదరాబాద్ పారిపోయాడు.
వీళ్లంతా కలిసి సాధించింది ఒక్కటే... ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి చంచల్ గూడా జైల్లో ప్రత్యేక ఖైదీ హోదా సాధించారు.
గూడూరు ఎమ్మెల్యే కలెక్షన్ ప్రసాద్!
గూడూరు నియోజకవర్గాన్ని గొప్పగా అభివృద్ధి చేస్తారని 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో వరప్రసాద్ రావు గారిని గెలిపించారు. గూడూరుకి గుండు కొట్టడం తప్ప చేసింది ఏమైనా ఉందా? ఒక్క దళితుడి జీవితం అయినా మారిందా? కష్టపడి వరప్రసాద్ గారిని గెలిపించుకున్న వైసీపీ కార్యకర్తలు, నాయకులే వరప్రసాద్ గారి పేరుని కలక్షన్ ప్రసాద్ గా మార్చారట.
ఆయన పలకరింపు సూపర్ గా ఉంటుంది అంట... అందరినీ బాగున్నావా నాన్న, ఎలా ఉన్నావ్ నాన్న? అని పలకరిస్తారు కానీ పని మాత్రం జరగదు. ఆయన చాలా ఓపెన్ గా ఉంటారు. ఎంపీ, ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవడానికి జగన్ కి వందల కోట్లు లంచం ఇచ్చాను. డబ్బులేమీ ఊరికే రావు అంటూ చికెన్ షాపులు, చేపల మార్కెట్, కూరగాయల మార్కెట్ నుండి కూడా లంచం వసూలు చేస్తున్నారు.
ఎమ్మెల్యే కొడుకు నేతృత్వంలో గ్రావెల్ మాఫియా
గూడూరు, చిల్లకూరులో అక్రమ గ్రావెల్ మాఫియా అంతా ఎమ్మెల్యే వరప్రసాద్, ఆయన కుమారుడు నవీన్ నడుపుతున్నారు. ఇప్పటికే అక్రమ గ్రావెల్ మాఫియా ద్వారా రూ.100 కోట్లు కొట్టేసినట్టు వైసీపీ నేతలే చెబుతున్నారు.
కలక్షన్ ప్రసాద్ గారి ఎమ్మెల్యే లెటర్ వేల్యూ ఎంతో తెలుసా? 5 వేలు. అంగన్వాడీ పోస్టులు అమ్మకం, ట్రాన్స్ ఫర్లకు వసూళ్లు, నామినేటేడ్ పోస్టుల వేలం, గుడి ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ పదవులకు రేట్ కార్డు ఉంటుందట.
ఈయన స్టోరీలు విన్న తరువాత ఇలాంటి ఎమ్మెల్యే ఉంటారా అని నా దిమ్మ తిరిగిపోయింది. గూడూరు మున్సిపాలిటీ లోకమిషనర్ ని పార్ట్నర్ గా చేసుకొని రోడ్లు వెయ్యకుండానే బిల్లులు డ్రా చేసినట్టు తెలిసింది. షాపింగ్ కాంప్లెక్ లో అక్రమాలు, స్పెషల్ ఆఫీసర్లతో దొంగ సంతకాలు చేయించి రూ.50 కోట్లు దోచేశాడు.
కలెక్షన్ లెక్క రాయడానికి 100మంది!
కలక్షన్ ప్రసాద్ అవినీతి ఏ రేంజ్ లో ఉందో తెలిస్తే స్టేట్ షాక్ అవుతుంది. ఇసుక, గ్రావెల్, సిలికా ట్రాన్స్ పోర్ట్ లో లెక్కలు పక్కాగా రాసేందుకు 100 మందిని పెట్టుకున్నారు. వీళ్ల పని ఏంటో తెలుసా? ఎన్ని లారీలు వెళ్లాయి, టైం, డేట్ అంతా రాసి రాత్రికి కలెక్షన్ ఎంత వచ్చిందో చెప్పాలి. మున్సిపాలిటీలో అక్రమాలకు మీరా రెడ్డి, గ్రావెల్ అక్రమ తవ్వకాలకు సతీష్ రెడ్డి ఇలా కలక్షన్ ఏజెంట్లను పెట్టుకున్నారు కలక్షన్ ప్రసాద్.
*యువగళం పాదయాత్ర వివరాలు:*
*ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 1835.2 కి.మీ.*
*ఈరోజు నడిచిన దూరం 13.6 కి.మీ.*
*141వ రోజు పాదయాత్ర వివరాలు (29.6.2023):*
*గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం (తిరుపతి జిల్లా):*
మధ్యాహ్నం
2.00 – కాకువారిపాలెం క్యాంప్ సైట్ లో యువతతో ముఖాముఖి.
సాయంత్రం
4.00 – కాకువారిపాలెం క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
4.10 – కాకువారిపాలెంలో రైతులతో సమావేశం.
5.10 – బల్లవోలులో స్థానికులతో సమావేశం.
5.40 – బల్లవోలు ఎస్టీ కాలనీలో స్థానికులతో మాటామంతీ.
6.10 – కొత్తపాలెం క్రాస్ వద్ద స్థానికులతో మాటామంతీ.
6.35 – చింతవరంలో స్థానికులతో సమావేశం.
6.50 – చింతవరం జంక్షన్ లో స్థానికులతో సమావేశం.
7.00 – చింతవరం అరుంధతివాడలో స్థానికులతో సమావేశం.
7.20 – మొగలికొత్తపాలెంలో స్థానికులతో సమావేశం.
7.35 – అల్లీపురంలో స్థానికులతో సమావేశం.
7.50 – ఏరూరులో స్థానికులతో మాటామంతీ.
8.55 – మోమిడి ఎస్సీ కాలనీలో సమావేశం.
9.05 – మోమిడిలో స్థానికులతో సమావేశం.
9.30 – వరగలి శివారు క్యాంప్ సైట్ లో బస.
******