Kapil Sibal: తొమ్మిదేళ్ల తర్వాత ఇప్పుడెందుకు?: మోదీకి కపిల్ సిబాల్ ప్రశ్న
- దేశానికి ఉమ్మడి పౌరస్మృతి అవసరం అన్న మోదీ
- తొమ్మిదేళ్ల తర్వాత ఇప్పుడు ఎందుకు తీసుకురావాలనుకుంటున్నారన్న సిబాల్
- మీ పార్టీ నేతలు ప్రతి రోజు ముస్లింలను టార్గెట్ చేస్తున్నారని విమర్శ
ఉమ్మడి పౌరస్మృతి ఈ దేశానికి అవసరం అంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి కపిల్ సిబాల్ స్పందించారు. మోదీ చెపుతున్న ఉమ్మడి ఎంతవరకు ఉమ్మడిగా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. ఉమ్మడి పౌరస్మృతి హిందువులను, గిరిజనులను, ఈశాన్య రాష్ట్రాల ప్రజలను కూడా కవర్ చేస్తుందా? అని ప్రశ్నించారు. మీరు అధికారంలోకి వచ్చిన తొమ్మిదేళ్ల తర్వాత ఇప్పుడు ఉమ్మడి పౌరస్మృతిని ఎందుకు తీసుకురావాలనుకుంటున్నారని ప్రశ్నించారు. 2024 ఎన్నికల కోసమా అని అడిగారు. విపక్షాలు ముస్లింలను ఓటు బ్యాంకుగా చూస్తున్నాయన్న ప్రధాని వ్యాఖ్యలను కూడా ఆయన తప్పుపట్టారు. మీ పార్టీ నేతలు ప్రతి రోజు ముస్లింలను టార్గెట్ చేస్తున్నారని... ఇప్పడు మీరు ముస్లింల గురించి ఆందోళన చెందుతున్నారని ఎద్దేవా చేశారు.