national geograhic: ఇక 'నేషనల్ జియోగ్రాఫిక్' మ్యాగజైన్ ముతపడనుందా?
- సంస్థలో మిగిలిన చివరి స్టాప్ రైటర్లను కూడా ఉద్యోగం నుండి తొలగించిన మ్యాగజైన్
- గత ఏడాది సెప్టెంబర్ నుండి వరుసగా తొలగింపులు
- 1888లో ప్రారంభమైన మ్యాగజైన్.. 2015 నుండి ఒడిదుడుకులు
- తొలగింపు ప్రభావం మ్యాగజైన్ కార్యకలాపాలపై ఉండదన్న నేషనల్ జియోగ్రాఫిక్
ప్రసిద్ధ మ్యాగజైన్ నేషనల్ జియోగ్రాఫిక్ త్వరలో మూతబడనున్నట్టుగా వార్తలొస్తున్నాయి. ఈ సంస్థలో చివరి స్టాఫ్ రైటర్లను తాజాగా ఉద్యోగం నుండి తొలగించింది. కొన్ని రోజులుగా ఈ కంపెనీలో ఉద్యోగాల కోతను చేపడుతున్నారు. అయితే ఇప్పటి వరకు మిగిలిన 19 మందిని కూడా బుధవారం తొలగించారు. ఈ మేరకు సీనియర్ సభ్యులు ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ తొలగింపు తర్వాత మ్యాగజైన్ లో రైటర్లు ఎవరూ లేరు. వచ్చే ఏడాది నాటికి ఇది న్యూస్ స్టాండ్స్ లో ఇక కనిపించదని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది.
1888లో నేషనల్ జియోగ్రాఫిక్ తొలి మ్యాగజైన్ విడుదల కాగా, 2015 నుండి మాత్రం కంపెనీ యాజమాన్యం మారుతూ వస్తోంది. ఎడిటోరియల్ పరంగాను ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఈ మ్యాగజైన్ ను డిస్నీ నిర్వహిస్తోంది. అయితే విక్రయాలు తగ్గడం సహా వివిధ కారణాలతో ఖర్చు తగ్గింపు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గత ఏడాది సెప్టెంబర్ లో ఆరుగు టాప్ ఎడిటర్స్ ను తొలగించింది. ఆ తర్వాత పలుమార్లు లేఆఫ్ లు చేపడుతూ వచ్చింది. ఇప్పుడు రైటర్లకూ ఉద్వాసన పలికింది.
మరోపక్క, రైటర్ల తొలగింపు వల్ల మ్యాగజైన్ కార్యకలాపాల్లో ఎలాంటి మార్పులు ఉండవని, ఇక విభిన్న కథనాలతో ఎక్కువమంది పాఠకుల దరిచేరుతామనే విశ్వాసం ఉందని, ఉద్యోగుల తొలగింపు ప్రభావం మ్యాగజైన్ పైన ఉండదని సంస్థ అభిప్రాయపడింది.