indigo: ఇండిగోలో నాడు రూ.10,000 ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు మీ చేతికి ఎంత వస్తుందో తెలుసా...!
- చివరి ట్రేడింగ్ సెషన్ లో ఆరు శాతం జంప్ చేసిన ఇండిగో షేర్లు
- ఏడాది కాలంలో 63 శాతం అప్
- రూ.2,617కు చేరుకున్న ఇండిగో షేర్ ధర
- 2015లో ఇండిగో ఐపీవో
భారత విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్ లైన్స్ మాతృసంస్థ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ (ఇండిగో) స్టాక్స్ స్థిరంగా కదులుతున్నాయి. ఈ స్టాక్ ఇటీవల పరుగులు పెడుతోంది. బుధవారం నాటి ట్రేడింగ్ సెషన్ లో 6 శాతం ఎగిసి రూ.2,617 వద్ద ముగిసింది. గత ఆరు నెలల కాలంలో 30 శాతం, ఏడాదిలో 63 శాతం జంప్ చేసింది.
ఈ నేపథ్యంలో ఇండిగో ఐపీవో వచ్చిన సమయంలో మీరు ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు వచ్చేది ఎంతంటే...!
2015లో ఇండిగో ఐపీవోలో మీరు రూ.10,000 ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు మీ పెట్టుబడి ప్రస్తుత విలువ రూ.34,020గా ఉండేది. అంటే 240 శాతానికి పైగా రాబడి ఉండేది. ఐపీవో సమయంలో ఇండిగో షేర్ వ్యాల్యూ రూ.765గా ఉంది. ఇప్పుడది రూ.2,617 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇండిగో పక్కా ప్లాన్ తో, పటిష్ఠంగా ముందుకు సాగుతోంది. పోటీ సంస్థల వైఫల్యాలను అనుకూలంగా మార్చుకుంది.
ఈ కంపెనీ ఆపరేషన్స్ రెవెన్యూ 2023 మార్చిలో ఏడాది ప్రాతిపదికన 76 శాతం పెరిగి రూ.14,160 కోట్లకు చేరుకుంది. 2022 మార్చిలో ఆదాయం రూ.8,020.75 కోట్లుగా నమోదయింది. 2022 మార్చి త్రైమాసికంలో రూ.1,681 కోట్ల నష్టం రాగా, ఈ మార్చి త్రైమాసికంలో రూ.919.2 కోట్ల లాభం నమోదు చేసింది.
కంపెనీ సానుకూల, రిస్క్ ఫ్యాక్టర్స్ విషయానికి వస్తే.... గో ఫస్ట్ పతనం ఇండిగోకు లాభసాటిగా మారింది. దీంతో కంపెనీ షేర్లు కూడా పెరుగుతూ వస్తున్నాయి. అంతర్జాతీయంగా కంపెనీ విస్తరణకు మొగ్గు చూపడం కలిసి వచ్చింది. అదే సమయంలో, ఎయిరిండియా సహా ఇతర విమానయాన సంస్థలతో ఇండిగో గట్టి పోటీని ఎదుర్కొంటోంది.