UCC: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే ‘ఉమ్మడి పౌరస్మృతి’
- ఉమ్మడి పౌరస్మృతిపై పట్టుదలగా ఉన్న కేంద్రం
- ఈ సమావేశాల్లోనే టేబుల్‌పైకి ముసాయిదా బిల్లు
- ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడే వారే దానిని వ్యతిరేకిస్తున్నారన్న ప్రధాని
కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) ముసాయిదా బిల్లు ఈ వర్షాకాల సమావేశంలో పార్లమెంటు ముందుకు వచ్చే అవకాశం ఉందని అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. యూసీసీపై అభిప్రాయాలు తెలుసుకునేందుకు న్యాయ కమిషన్, న్యాయ మంత్రిత్వశాఖతో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ జులై 3న సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది.
ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తామంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారమే స్పష్టం చేశారు. సున్నితమైన అంశాలపై ముస్లింలను రెచ్చగొడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు కూడా దీనిపై సానుకూలంగా ఉందని, కానీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడేవారే దానిని వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. ఒకే దేశంలో రెండు విధానాలు ఏంటని ప్రశ్నించారు. కాగా, లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ ఉమ్మడి పౌరస్మృతి అంశాన్ని తెరపైకి తీసుకురావడంతో కేంద్రంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.