Team India: అమ్మ, అక్క గురించి అంటే అస్సలు ఊరుకోను: యశస్వి జైస్వాల్
- ఐపీఎల్‌లోనూ కొందరు స్లెడ్జింగ్ చేస్తారన్న యువ క్రికెటర్
- మైదానంలో దూకుడుగా ఉండటం సహజమేనని వ్యాఖ్య
- వెస్టిండీస్ తో టెస్టులకు భారత జట్టులోకి వచ్చిన యశస్వి
యశస్వి జైస్వాల్.. కొన్నాళ్లుగా భారత క్రికెట్ లో మార్మోగుతున్న పేరిది. దేశవాళీ క్రికెటర్, ఐపీఎల్ లో దుమ్మురేపుతున్న ఈ యువ ఆటగాడు వెస్టిండీస్ టూర్ లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగు పెట్టాడు. ఈ నెల 12 నుంచి వెస్టిండీస్ తో జరిగే రెండు టెస్టుల సిరీస్ కు అతను తొలిసారి భారత జట్టులో చోటు సంపాదించాడు. తల్లిదండ్రులకు దూరంగా ఉండి, ఎంతో కష్టపడి పైకి వచ్చిన ఈ యువ ఆటగాడి ప్రయాణం చాలా మంది యువ క్రికెటర్లకు స్ఫూర్తినిస్తుంది. క్రమశిక్షణ, ఆట పట్ల నిబద్ధత అతడిని అగ్రశేణి క్రికెటర్ గా మార్చనుంది. అయితే, ఒక దేశవాళీ మ్యాచ్‌లో ప్రత్యర్థి బ్యాటర్‌తో కొన్ని మాటలు మాట్లాడినందుకు కెప్టెన్ అజింక్యా రహానే అతన్ని మైదానం నుంచి బయటికి పంపించాడు. సౌత్ జోన్ బ్యాటర్ రవితేజను స్లెడ్జింగ్ చేసినందుకు అజింక్య రహానే అతడిని వెనక్కి పంపాడు.
2022లో దులీప్ ట్రోఫీలో జరిగిన సంఘటన గురించి యశస్వి తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు. ఈ ఘటనపై యశస్వి జైస్వాల్ మాట్లాడుతూ, తాను అప్పుడు మరీ దారుణంగా ఏమీ మాట్లాడలేదని అన్నాడు. మైదానంలో దూకుడుగా ఉండే క్రమంలో ఇలాంటి ఘటనలు జరుగుతాయని చెప్పాడు. ఇక, ఐపీఎల్‌లోనూ స్లెడ్జింగ్ జరుగుతుందని యశస్వి తెలిపాడు. ఈ విషయం చాలా మందికి తెలియదన్నాడు. అయితే, మైదానంలో ఎవరేం అంటున్నారనేదానిపై ప్రతిస్పందన ఉంటుందని చెప్పాడు. ఎవరైనా తన తల్లిని, సోదరిని దుర్భాషలాడితే తాను మౌనంగా ఉండనని స్పష్టం చేశాడు.