Niharika Konidela: తాను ఎక్కడ ఉన్నదీ తెలిపిన కొణిదెల నిహారిక భర్త చైతన్య

Konidela Niharika husband Chaitanya is in Mumbai
  • చాలా కాలంగా దూరంగా ఉంటున్న నిహారిక, చైతన్య
  • వరుణ్ తేజ్ ఎంగేజ్ మెంట్ కు కూడా రాని చైతన్య
  • ముంబైలోని గ్లోబల్ విపాసన పగోడాలో ఉన్నట్టు వెల్లడి
ప్రముఖ సినీ నటుడు నాగబాబు కుమార్తె కొణిదెల నిహారిక తన భర్త చైతన్య జొన్నలగడ్డకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ విడాకులు తీసుకున్నారనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున సాగుతోంది. ఇటీవల జరిగిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ఎంగేజ్ మెంట్ కు కూడా చైతన్య రాలేదు. దీంతో ఇద్దరూ విడిపోయారనే నిర్ణయానికి అందరూ వచ్చారు. మరోవైపు చాలా కాలం తర్వాత సోషల్ మీడియా ద్వారా చైతన్య స్పందించాడు. 

ముంబైలోని గ్లోబల్ విపాసన పగోడా మెడిటేషన్ సెంటర్ లో తాను ఉన్నట్టు చైతన్య సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. తనను ఇక్కడకు వచ్చేట్టు చేసిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటానని చెప్పాడు. మనం ఓ చోటుకు ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్లి తిరిగొస్తుంటామని... ఇది కూడా అలాంటిదేనని అన్నాడు. గత 10 రోజులుగా తాను చేస్తున్న విపాసన ప్రక్రియ ఒక గొప్ప అనుభూతి అని చెప్పాడు.
Niharika Konidela
Husband
Chaitanya
Tollywood

More Telugu News