Nara Lokesh: మంచి పేరొస్తుందో రాదో తెలియదు... వారికి చెడ్డపేరు మాత్రం తీసుకురాను: లోకేశ్
- సర్వేపల్లి నియోజకవర్గంలో లోకేశ్ యువగళం
- ముత్తుకూరులో భారీ సభ
- సింహపురిలో తాను సింహంలా అడుగుపెట్టానన్న లోకేశ్
- సిల్లీ బచ్చా చర్చ అనగానే తోకముడిచాడని ఎద్దేవా
- అతడికే బుల్లెట్ దిగిందని వ్యంగ్యం
నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సాయంత్రం ముత్తుకూరు సభలో లోకేశ్ ప్రసంగించారు. సింహపురిలో తాను సింహంలా అడుగుపెట్టానని వెల్లడించారు. తానేమీ పరదాలు కట్టుకొని యాత్ర చెయ్యడం లేదని స్పష్టం చేశారు. యువగళానికి వస్తున్న రెస్పాన్స్ చూసి పిల్ల సైకోలు రోడ్ల మీదకి వచ్చి మొరుగుతున్నాయని, హాఫ్ నాలెడ్జ్ సిల్లీ బచ్చా అభివృద్ధి మీద చర్చ అనగానే తోకముడిచాడని ఎద్దేవా చేశారు.
"సిల్లీ బచ్చా సీటు గల్లంతు అయ్యిందని తెలిసి, ఫ్రస్ట్రేషన్ లో సొంత పార్టీ నాయకుల్ని, ఆఫ్ ది రికార్డ్ జగన్ ని బండ బూతులు తిడుతున్నాడు. పాపం ఫ్రస్ట్రేషన్ పీక్స్ కి వెళ్లి సెక్యూరిటీ గార్డ్స్ మీద దాడులకు దిగుతున్నాడు.
పిల్ల కాలువ తవ్వడం రాని వాడు... పర్సెంటా, అర పర్సెంటా తొందర ఎందుకన్నా... వీ విల్ కంప్లీట్ దిస్ ప్రాజక్ట్ బై 2021 డిసెంబర్ అన్నాడు. ఇప్పుడు ఆయనకే బుల్లెట్ దిగింది" అంటూ లోకేశ్ వ్యంగ్యం ప్రదర్శించారు.
పుణ్యభూమిపై పాదయాత్ర చేయడం అదృష్టం
సర్వేపల్లి జనసునామీ సూపర్. దేశానికే వెలుగునిచ్చే దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ ప్రాజెక్టు, కృష్ణపట్నం పోర్టు సర్వేపల్లి సొంతం. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆశ్రమం. మస్తానయ్య దర్గా, వేళాంగిణి మాత చర్చి ఉన్న పుణ్య భూమి సర్వేపల్లి. ఎంతో ఘన చరిత్ర ఉన్న సర్వేపల్లి నేలపై పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం.
మా తాత గారు, మా నాన్న గారికి ఉన్నంత మంచి పేరు వస్తుందో రాదో నాకు తెలియదు. వారికి చెడ్డ పేరు మాత్రం తీసుకురాను. నాపై అనేక ఆరోపణలు చేశారు. ఒక్కటి కూడా నిరూపించలేకపోయారు.
బిల్డప్ బాబాయ్ జగన్!
జగన్ ఒక బిల్డప్ బాబాయ్. ఆయన బిల్డప్ కి రియాలిటీకి తేడా మీకు తెలియాలి. రెండు ఉదాహరణలు చెబుతాను. మొదటిది సత్య నాదెళ్ల. జగన్ ఇంటికో సత్య నాదెళ్ల ను తయారు చేస్తానని ప్రకటించాడు. ఇది బిల్డప్. రియాలిటీ ఏంటో తెలుసా? ఊరికో అనంతబాబుని తయారు చేశాడు. ఏపీని గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చాడు.
రెండో ఉదాహరణ రూ.3 వేల పెన్షన్. టీడీపీ హయాంలో 50 వేల లోపు ఉన్న రైతు రుణాలు అన్ని ఒకే సంతకంతో మాఫీ చేస్తే, ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ మొత్తం లక్షా యాభైవేలు ఒకేసారి మాఫీ చెయ్యాలని రచ్చరచ్చ చేశాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.2 వేల పెన్షన్ ని రూ.3 వేలకు పెంచుతానని బిల్డప్ ఇచ్చిన జగన్, సీఎం అయిన తరువాత రూ.750 రూపాయల పెన్షన్ పెంచడానికి నాలుగేళ్లు పట్టింది.
సర్వేపల్లికి కాకాణి వల్ల ఒరిగిందేమిటి?
సర్వేపల్లి రూపురేఖలు మార్చేస్తాడని రెండు సార్లు మీరు కాకాణి గోవర్ధన్ రెడ్డిని గెలిపించారు. సర్వేపల్లిని గాలికొదిలేసి కాకాణి దొంగ సంతకాలు, కల్తీ మద్యం, కోర్టు దొంగతనాల్లో బిజీగా ఉన్నాడు. అందుకే ఆయనకు కోర్టు దొంగ అని పేరు పెట్టా.
టీడీపీ హయాంలో సర్వేపల్లి నియోజకవర్గం అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా ఉంది. కానీ కోర్టు దొంగ హయాంలో అక్రమ మైనింగ్, భూదందాలు, కక్ష సాధింపులకు అడ్డాగా మారింది. టీడీపీ హయంలోనే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు పోరాడి 2 వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారు.
దళితుల భూమిని కబ్జాచేసిన కోర్టుదొంగ
ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే వావిలేటిపాడులో 4.70 ఎకరాల భూమిని కబ్జా చేశారు. ఆనాడు సోమిరెడ్డి గారు దళితుల పక్షాన నిలబడి వారి భూములు వెనక్కి ఇప్పించారు. అక్కడే ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల ప్లాట్లను కూడా కోర్టు దొంగ కొట్టేశాడు. ఆ కేసు కోర్టులో ఉంది. 2014 ఎన్నికల్లో కల్తీ మద్యం పంచి అమాయకుల ప్రాణాలు తీశాడు. ఈ కేసులో నిందితుడుగా ఉన్న కృష్ణస్వామి జైల్లోనే చనిపోయాడు.
ఈ మహా కంత్రీ కోర్టు దొంగ... సోమిరెడ్డి గారికి వెయ్యి కోట్ల ఆస్తి ఉన్నట్టు దొంగ డ్యాకుమెంట్లు తయారు చేయించాడు. ఆ కేసులో శిక్ష తప్పదని ఏకంగా కోర్టులోనే దొంగతనం చేశాడు. కోర్టు దొంగ సొంత పార్టీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి తెలియకుండానే ఆయన పేరు మీద గ్రావెల్ కొట్టేశాడు. ఏకంగా ఎంపీ పైనే కేసు పెట్టేలా చేసాడు ఈ కోర్టు దొంగ.
మీడియాను కూడా వదలకుండా వేధింపులు
ఆఖరికి మీడియా వాళ్ళని కూడా వదలలేదు ఈ కోర్టు దొంగ. గ్రామాల్లో పర్యటనకు వెళ్ళినప్పుడు ఒక మహిళ కోర్టు దొంగని నిలదీసింది. అది కవర్ చేసిన మీడియా ప్రతినిధి శ్రీనివాస్ పై కేసు పెట్టి వేధించాడు.
అవినీతి సొమ్ము కక్కిస్తాం!
పక్క పార్టీ మీటింగ్ జరిగే చోట ఫ్లెక్సీలు పెట్టే చీప్ మెంటాలిటీ ఈ కోర్టు దొంగది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నీ ఫ్లెక్సీలు అన్ని జైలు ముందే రాసిపెట్టుకో. మూడు వేల కోట్ల రూపాయలు కక్కిస్తా. టీడీపీ నాయకుల్ని, కార్యకర్తల్ని వేధించిన ఎవరినీ వదిలిపెట్టను. వడ్డీతో సహా చెల్లిస్తా. పసుపు జెండాని మోస్తున్న వారిని గుండెల్లో పెట్టుకుంటా. నమ్ముకున్న సిద్దాంతం కోసం, ప్రజల కోసం పోరాడదాం.
*యువగళం పాదయాత్ర వివరాలు*
*ఇప్పటి వరకు నడిచిన దూరం – 1884 కి.మీ.
*ఈ రోజు నడిచిన దూరం – 15.7 కి.మీ.*
*144వ రోజు పాదయాత్ర వివరాలు (2-7-2023):*
*నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్ పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా)*
సాయంత్రం
4.00 – కాకుపల్లి క్యాంప్ సైట్ నుండి పాదయాత్ర ప్రారంభం.
4.45 – ధనలక్ష్మీపురంలో స్థానికులతో మాటామంతీ.
5.00 – ధనలక్ష్మీపురం జంక్షన్ లో స్థానికులతో సమావేశం.
5.15 – గుండ్లపాలెంలో స్థానికులతో సమావేశం.
5.45 – వడ్డెపాలెం – నారాయణ మెడికల్ కాలేజీ జంక్షన్ లో స్థానికులతో సమావేశం.
6.00 – పార్థసారధి నగర్ లో స్థానికులతో మాటామంతీ.
6.20 - ఆకుతోట జంక్షన్ లో ఎస్సీ సామాజికవర్గీయులతో సమావేశం.
6.50 – అపోలో హాస్పిటల్ జంక్షన్ లో స్థానికులతో మాటామంతీ.
7.05 – హరనాథపురంలో స్థానికులతో సమావేశం.
7.20 – ఆనం వెంకటరెడ్డి సర్కిల్ లో స్థానికులతో మాటామంతీ.
8.00 – అనిల్ గార్డెన్స్ విడిది కేంద్రంలో బస.
******