Cricket: వన్డేల్లో అరుదైన ఘటన.. అంపైర్ పొరపాటే కారణం!

SL vs NZ New Zealand womens cricket team spinner Eden Carson bowls 11 overs in ODI with Umpires mistake

  • న్యూజిలాండ్ వర్సెస్ శ్రీలంక వన్డే మ్యాచ్ లో ఘటన
  • 11 ఓవర్లు వేసిన న్యూజిలాండ్ బౌలర్
  • 41 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసిన కార్సన్

క్రికెట్ లో అంపైర్ పాత్ర కీలకమనే విషయం తెలిసిందే.. అలాంటిది అంపైర్ పొరపాటు చేస్తే మ్యాచ్ ల ఫలితాలే తారుమారైపోతాయి. తాజాగా న్యూజిలాండ్, శ్రీలంకల మధ్య జరిగిన మహిళల వన్డే మ్యాచ్ లో ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. న్యూజిలాండ్, శ్రీలంక మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో కివీస్ బౌలర్ ఐడాన్ కార్సన్ 11 ఓవర్ల స్పెల్ బౌలింగ్ చేసింది. మ్యాచ్ 45వ ఓవర్ వేసిన తర్వాత కార్సన్ 10 ఓవర్లు పూర్తయ్యాయి.

అయితే, 47వ ఓవర్ లో మరోమారు కార్సన్ బౌలింగ్ కు సిద్ధమైంది. అప్పటికే కార్సన్ స్పెల్ పూర్తయిన విషయం గుర్తించని అంపైర్.. కార్సన్ బౌలింగ్ కు అనుమతించాడు. దీంతో కార్సన్ 11 వ ఓవర్ కూడా వేసి వన్డే చరిత్రలో 11 ఓవర్లు వేసిన తొలి బౌలర్‌గా నిలిచింది.

ఐడాన్ కార్సన్ 11 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 41 పరుగులు మాత్రమే ఇచ్చి శ్రీలంక స్టార్ ఆటగాళ్లు ఇద్దరిని పెవిలియన్ కు పంపించింది. తన 11వ ఓవర్‌లో 5 డాట్ బాల్స్ వేసి, ఒక రన్ మాత్రమే ఇచ్చింది. కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 329 పరుగులు చేసింది. అనంతరం 330 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 218 పరుగులకే ఆలౌటైంది. న్యూజిలాండ్ మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది.

  • Loading...

More Telugu News