Allu Arjun: హిట్ కాంబినేషన్‌ రిపీట్.. బన్నీతో త్రివిక్రమ్ నాలుగో సినిమా ఫిక్స్​

The iconic duo of AlluArjun and Trivikram are ready to reunite
  • జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో సూపర్ హిట్స్
  • రాధాకృష్ణ, అల్లు అరవింద్ నిర్మాణంలో నాలుగో చిత్రం
  • ప్రస్తుతం గుంటూరు కారం, పుష్ప2లో బిజీగా ఉన్న త్రివిక్రమ్, బన్నీ
టాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్లలో త్రివిక్రమ్ శ్రీనివాస్–అల్లు అర్జున్ ముందుంటారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో సూపర్ హిట్స్‌ గా నిలిచాయి. తాజాగా బన్నీ, త్రివిక్రమ్‌ కాంబో నుంచి నాలుగో సినిమా రానుంది. ఈ విషయంపై సోమవారం అధికారిక ప్రకటన వచ్చింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, టాప్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ నాలుగో చిత్రాన్ని హారిక హాసిని క్రియేష‌న్స్‌, గీతా ఆర్ట్స్ ప‌తాకాల‌పై రాధాకృష్ణ‌, అల్లు అర‌వింద్  నిర్మించ‌బోతున్నారు. హీరోగా  బన్నీకి ఇది 22వ సినిమా కానుంది. దీనికి త‌మ‌న్ సంగీతాన్ని అందించ‌బోతున్నారు. 

త్రివిక్రమ్ ప్ర‌స్తుతం మ‌హేష్‌ బాబుతో గుంటూరు కారం సినిమా రూపొందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జ‌న‌వ‌రిలో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మరోవైపు పుష్ప సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్ గా మారిన బన్నీ.. ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో దాని సీక్వెల్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ రెండు ప్రాజెక్ట్‌లు పూర్త‌యిన త‌ర్వాతనే అల్లు అర్జున్‌, త్రివిక్ర‌మ్ సినిమా పట్టాలు ఎక్కనుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తామని చిత్ర బృందం తెలిపింది. ఇద్దరి కాంబినేషన్‌ లో గత మూడు చిత్రాలకంటే ఇది భారీ స్థాయిలో ఉంటుందని ప్రకటించింది.
Allu Arjun
Trivikram Srinivas
4th time

More Telugu News