Neymar: బ్రెజిల్ ఫుట్‌బాల్ స్టార్ నేమార్‌కు రూ. 27 కోట్లకుపైగా జరిమానా!

Neymar Fined over 3 Million Dollars For Building Lake At Mansion

  • తన విలాసవంతమైన భవనం వద్ద కృత్రిమ సరస్సు, బీచ్ నిర్మాణం
  • పర్యావరణ నిబంధనలు తుంగలో తొక్కినట్టు ఆరోపణలు
  • అప్పీలుకు 20 రోజుల గడువు

బ్రెజిల్ ఫుట్‌బాల్ స్టార్ నేమార్‌ (31)కు కోర్టు 3.3 మిలియన్ డాలర్ల (రూ.27 కోట్లకుపైగా) జరిమానా విధించింది. పర్యావరణ అనుమతులు లేకుండా రియో డి జెనీరో శివారులోని తన ఇంటి నివాసం వద్ద సరస్సు నిర్మించినందుకు గాను ఈ భారీ ఫైన్ విధించింది.

 నేమార్ తన భవనం వద్ద కృత్రిమ సరస్సు నిర్మాణంలో నిబంధనలు ఉల్లంఘించినందుకు టౌన్ కౌన్సిల్ నాలుగు జరిమానాలు విధించినట్టు కౌన్సిల్ సెక్రటేరియట్ తెలిపింది. నేమార్‌కు మొత్తంగా 16 మిలియన్ రియాలు (రూ. 27,27,69,361) జరిమానా విధించినట్టు పేర్కొంది. అనుమతి లేకుండా నది నీటిని దొంగిలించడం, మళ్లించడం, వృక్ష సంపదను నరికివేయడం వంటి పలు అభియోగాలపై కౌన్సిల్ ఈ జరిమానా విధించింది. జరిమానాపై అప్పీలు చేసుకునేందుకకు నేమార్‌కు 20 రోజుల గడువు ఇచ్చింది.

జూన్ 22న సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా నేమార్ ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి. విలాసవంతమైన ఆయన భవనం వద్ద  నిర్మిస్తున్న కృత్రిమ సరస్సు, బీచ్‌లో అనేక పర్యావరణ ఉల్లంఘనలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. అనంతరం సైట్‌ను స్వాధీనం చేసుకుని కార్యకలాపాలు నిలిపివేయించారు. కోర్టు విధించిన జరిమానాపై నేమార్ కానీ, ఆయన కార్యాలయం కానీ ఇప్పటి వరకు స్పందించలేదు.

  • Loading...

More Telugu News