KGF2: ప్రశాంత్ నీల్ మాస్టర్ మైండ్.. కేజీఎఫ్2, సలార్ కు ముడి!

Master plan from Prashanth Neel to create a connection between KGF2 and Salaar
  • కేజీఎఫ్2 క్లైమాక్స్ లో యశ్ పై దాడి జరిగిన టైమ్ లో సలార్ టీజర్ విడుదలకు ముహూర్తం
  • గురువారం ఉదయం 5.12 గంటలకు సలార్ టీజర్
  • సెప్టెంబర్ 28న విడుదల కానున్న చిత్రం
రాధేశ్యామ్, ఆదిపురుష్ చిత్రాలతో రెండు డిజాస్టర్లను ఖాతాలో వేసుకున్న ప్యాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్‌ ఇప్పుడు సలార్ చిత్రంపైనే గంపెడాశలు పెట్టుకున్నాడు. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌  సినిమాపై చాలా అంచనాలున్నాయి. ఈ చిత్రంలో శ్రుతిహాసన్‌ హీరోయిన్‌ గా నటిస్తోంది. హోంబలే ఫిలింస్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్‌ నిర్మిస్తున్నారు. సెప్టెంబర్‌ 28న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.  ఈ నెల 6న సలార్ టీజర్ విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. 

ఆరో తేదీన ఉదయం 5.12 గంటలకు టీజర్ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ యూబ్యూట్ చానెల్లో టీజర్ రిలీజ్ కానుంది. సాధారణంగా టీజర్, ట్రైలర్లను తెల్లవారుజామున విడుదల చేసిన దాఖలాలు లేవు. ఇందుకు భిన్నంగా సలార్ టీజర్ ఉదయం 5.12 గంటలకు రానుండటం వెనుక దర్శకుడు ప్రశాంత్ నీల్ మాస్టర్ మైండ్ ఉందట. కేజీఎఫ్2కి, సలార్ కు ఏదో లింక్ పెట్టినట్టు తెలుస్తోంది. కేజీఎఫ్2 క్లైమాక్స్ లో సరిగ్గా ఇదే సమయంలో హీరో యశ్ పై సముద్రంలో దాడి జరుగుతోంది. ఈ మేరకు యశ్ ప్రయాణిస్తున్న ఓడలోని గడియారాల్లో సమయం చూపే సీన్ ఉంది.

ఇప్పుడు సలార్ టీజర్ ను కూడా ఆ సమయంలో విడుదల చేస్తున్న నేపథ్యంలో కేజీఎఫ్2కి, సలార్ కి సంబంధం ఏంటన్న ఆసక్తి మొదలైంది. రెండు చిత్రాలను ముడి పెడుతూ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఓ మాస్టర్ ప్లాన్ వేశాడని ప్రముఖ కాలమిస్ట్ మనోబాల విజయబాలన్ చేసిన ట్వీట్ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఆ లింక్ ఏంటో గురువారం ఉదయం 5.12 గంటలకు టీజర్ రిలీజైన తర్వాత తెలియనుంది.
KGF2
Salaar
Prashanth Neel
Prabhas
yash

More Telugu News