Stock Market: రికార్డు స్థాయిలో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- దేశీయ మార్కెట్లలోకి వెల్లువెత్తుతున్న విదేశీ ఇన్వెస్ట్ మెంట్లు
- 274 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 66 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకుపోతున్నాయి. విదేశీ ఇన్వెస్ట్ మెంట్లు వెల్లువెత్తుతుండటం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వంటివి మార్కెట్లలో జోష్ ను నింపాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 274 పాయింట్లు లాభపడి 65,479కి చేరుకుంది. నిఫ్టీ 66 పాయింట్లు పుంజుకుని 19,389కి ఎగబాకింది. ఐటీ, టెక్, బ్యాంక్ స్టాకులు మార్కెట్లను ముందుండి నడిపించాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫైనాన్స్ (7.17%), బజాజ్ ఫిన్ సర్వ్ (5.76%), టెక్ మహీంద్రా (2.39%), సన్ ఫార్మా (1.61%), ఎన్టీపీసీ (1.54%).
టాప్ లూజర్స్:
భారతి ఎయిర్ టెల్ (-1.54%), యాక్సిస్ బ్యాంక్ (-1.18%), రిలయన్స్ (-1.03%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.89%), టాటా స్టీల్ (-0.57%).